ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో బుక్ మై షో (BookMyShow) లెక్కలు చూస్తే స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు బుక్ మై షోలో ఇప్పటివరకు ఏకంగా 1.7 మిలియన్ (17 లక్షలు) టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఒక ప్రాంతీయ సినిమాగా మొదలై పాన్ ఇండియా స్థాయిలో ఈ స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరగడం ప్రభాస్ స్టార్ పవర్‌కు నిదర్శనం. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు బుక్ మై షోలో అత్యధికంగా ట్రెండ్ అవుతున్న సినిమాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. మెట్రో నగరాలతో పాటు బి, సి సెంటర్లలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించి గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్తో మెప్పించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించి సినిమా స్థాయిని పెంచారు. ఎస్.ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని హారర్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ చిత్రాన్ని నిర్మించింది. మారుతి మార్కు కామెడీకి ప్రభాస్ స్వతహాగా ఉండే ఈజ్ తోడవ్వడంతో సినిమా వినోదాల పంట పండిస్తోంది.
ఈ టాక్‌తో కూడా ‘ది రాజా సాబ్’ మొదటి వారం ముగిసే సమయానికి మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే 1.7 మిలియన్ టికెట్లు అమ్ముడుపోవడం అనేది ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్ కెరీర్లో హారర్ కామెడీ జోనర్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ కొత్త ప్రయోగానికి బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్ల వద్ద సందడి ఇంకా తగ్గకపోవడం, కొత్తగా యాడ్ చేసిన సన్నివేశాలు సినిమాకు ఫ్లస్ కానున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంక్రాంతి సీజన్లో ప్రభాస్ ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద రారాజుగా నిలిచాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి