మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే బుక్‌మైషో పోర్టల్‌లో 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రాంతీయ తెలుగు సినిమాల్లో ఇంత తక్కువ సమయంలో ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దాటేసింది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక చిత్రం చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. వింటేజ్ చిరు కామెడీ టైమింగ్, డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరవడం, ఇద్దరు అగ్ర హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. నయనతార నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా మాస్ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. నిర్మాత సుష్మిత కొణిదెల తన తండ్రిని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా వెండితెరపై ఆవిష్కరించడంలో విజయం సాధించారు.


ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రభంజనం కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించి టాప్ గ్రాసర్ గా నిలిచింది. పండుగ సెలవులు ముగిసినా కూడా బుకింగ్స్ తగ్గకపోవడం సినిమా సత్తాకు నిదర్శనం. గత కొన్ని సినిమాల‌తో నిరాశ చెందిన అభిమానులకు ఈ సినిమా అసలైన మెగా ట్రీట్ ఇచ్చింది. బాక్సాఫీస్ రన్ గమనిస్తుంటే వచ్చే వారంలో ఈ సినిమా రు. 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ చిత్రం లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం.


మెగాస్టార్ చిరంజీవి తన 70వ ఏట కూడా అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడం చూసి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సామాజిక మాధ్యమాల్లో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమా విజయం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ తన నివాసంలో చిత్ర బృందానికి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: