కోలీవుడ్ నటుడు విజయ్ తలపతి రీసెంట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పార్టీ పేరుతో ఆయన ప్రజల్లోకి వచ్చారు. డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఈ పార్టీని పెట్టారు. అయితే ఇప్పటివరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. సొంతంగానే నేను పోటీ చేస్తానని సొంతంగానే సీఎం అవుతానని చెప్పుకువస్తున్నారు. అంతేకాదు విజయ్ ఎక్కడ సభ పెట్టినా కూడా అక్కడికి భారీగా జనం తరలి రావడంతో విజయ్ నెక్స్ట్ సీఎం అవుతారు కావచ్చని చాలామంది మాట్లాడుకుంటున్నారు.అలాగే తమిళనాడులో విజయ్ కి భారీ ఫ్యాన్స్ ఉండడం వల్ల యూత్ ఎక్కువగా ఈయనకి మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది.ఇదిలా ఉంటే విజయ్ రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆయనపై కొన్ని విమర్శలు అయితే ఆగడం లేదు.

రీసెంట్గా త్రిష విజయ్ ని కలుపుతూ తమిళనాడు బీజేపీ ఎంపీ నైనార్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ రాజకీయాల్లో కొనసాగాలంటే ముందు బయటికి రావాలి అంటూ మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలపై త్రిష ఫైర్ అయింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న రాజకీయ నేత ఇలా ఒక మహిళ వ్యక్తిగత జీవితం గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరం అంటూ ఘాటుగా స్పందించింది.ఇక త్రిష మాటలపై బీజేపీ ఎంపీ కూడా స్పందించి త్రిషకి క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.ఆ పోస్టులో ఏముందంటే.. "మన మీద ఎంత వ్యతిరేకత వచ్చినా.. ఏం జరిగినా.. ఈ ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా..నేను మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచి పెట్టను"..అంటూ పోస్ట్ పెట్టింది.
 ప్రస్తుతం త్రిష ఇంస్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అయితే ఆ పోస్టులో విజయ్ పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ చాలామంది ఈ పోస్ట్ విజయ్ ని ఉద్దేశించే త్రిష పెట్టిందని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాలకే త్రిష మళ్లీ డిలీట్ చేసినప్పటికి అప్పటికే కొంత మంది నెటిజెన్స్ ఈ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మంది జనాలు త్రిష పోస్ట్ పెట్టింది విజయ్ గురించేనని.. విజయ్ కి మద్దతుగా ఉంటానని..విజయ్ వెన్నంటే ఉంటానని పరోక్షంగా ఈ పోస్టు రూపంలో తెలిపిందని మాట్లాడుకుంటున్నారు. మరి త్రిష పెట్టిన పోస్ట్ విజయ్ ని ఉద్దేశించేనా లేక వేరే ఎవరినైనా ఉద్దేశించి పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: