చాలా కాలంగా కాల భైరవ, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా ఒక పుస్తకావిష్కరణ వేడుకలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని సందడి చేయడంతో ఈ వార్తలకు ‘అఫీషియల్’ ముద్ర పడినట్లయింది. ఆ ఈవెంట్‌లో వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, కెమిస్ట్రీ చూస్తుంటే.. నెటిజన్లు అప్పుడే వీరికి ‘బెస్ట్ కపుల్’ అంటూ శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టేశారు. ఇప్పటివరకు ఈ జంట తమ రిలేషన్ పై స్పందించకపోయినా, ఈ పబ్లిక్ అప్పియరెన్స్ చూశాక ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఈ ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా వివాహం ఇప్పటికే ఘనంగా జరగగా, ఇప్పుడు కాల భైరవ వంతు వచ్చింది. రాజమౌళి కుటుంబంలోకి మరో హీరోయిన్ కోడలిగా అడుగుపెడుతుండటం విశేషం. శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’ మూవీలో కావ్య హీరోయిన్‌గా నటించింది. ఆ షూటింగ్ సమయంలోనే కాల భైరవతో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారిందని ఇన్ సైడ్ టాక్.
కావ్య కళ్యాణ్‌రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘గంగోత్రి’, ‘బన్నీ’ వంటి సినిమాలతో మెప్పించి, ఇప్పుడు ‘మసూద’, ‘బలగం’ వంటి హిట్లతో హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అటు కాల భైరవ ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ స్టేజ్ పై గర్జించడమే కాకుండా సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గానూ బిజీగా ఉన్నారు.ఏదేమైనా టాలీవుడ్ మరో గ్రాండ్ వెడ్డింగ్‌కు వేదిక కాబోతోందని అర్థమవుతోంది. కీరవాణి గారి ఇంట్లో పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయో అని అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి