ధోని లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు సీఎస్కే జట్టుకు లేకపోవడం పెద్ద లోటుగా మారినంత పనైందని అభిమానులు, నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధోని కాలి ఖండరాలలో గాయం కారణాం చేత రెండు వారాలపాటు ఆయన మ్యాచులకు దూరంగా ఉండాల్సి వస్తోందని తెలుస్తోంది. వైద్య బృందం కూడా విశ్రాంతి తీసుకోవాలని ధోనీకి సూచించినట్లు సమాచారం. మ్యాచ్లో కెప్టెన్సీ ,వికెట్ కీపింగ్, ఫినిషర్ గా పేరు సంపాదించిన ధోని జట్టు క్లిష్ట సమయాలలో వ్యూహాలలో మార్పులు చేస్తూ ఎన్నో సందర్భాలలో విజయాన్ని అందుకునేలా చేశారు.
ధోనికి గాయమైందని వార్త అభిమానులకు తెలియగానే తీవ్ర నిరాశకు గురవుతున్నారు. స్టేడియంలో ధోని ఆటను చూడాలనుకున్న ఎంతోమంది అభిమానులు ఆశపడినప్పటికీ ఆ ఆశ ఇప్పుడు నిరుత్సాహంగా మారింది. ధోని గాయం తీవ్రతను బట్టి తిరిగి ఎప్పుడు జట్టులోకి వస్తారనే విషయం నిర్ణయించబడుతుందట. ప్రస్తుతం ధోని దృష్టి మాత్రం రికవరీ పైనే పెట్టినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం అంటే 2008 నుంచి ధోని ఆడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 278 మ్యాచులు ఆడగా , 5439 పరుగులు కూడా చేశారు. సీఎస్కే టీంకి ఇప్పటివరకు ధోని 5 ఐపీఎల్ ట్రోఫీలను అందించారు. ధోని దూరం కావడం చేత వికెట్ కీపర్ బాధ్యతలను ఊర్వేల్ పటేల్ కు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి