కీరవాణి తనయుడు simha KODURI' target='_blank' title='శ్రీ సింహా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రీ సింహా లీడ్ రోల్ లో రితేష్ రానా డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా మత్తువదలరా. ఈ సినిమాకు కీరవాణి మరో తనయుడు కాళ భైరవ మ్యూజిక్ అందించడం విశేషం. చిరంజీవి (చెర్రి), హేమలత నిర్మించిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కించారు. క్రిస్ మస్ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీస్కలో చూద్దాం.

 

కథ :

 

రూం మేట్స్ అయిన బాబు మోహన్ (శ్రీ సింహా), యేసుదాసు (సత్య) డెలివెరీ బోయ్స్ గా పనిచేస్తుంటారు. జీతం సరిపోని బాబు, యేసులు జీవితం మీద అసంతృప్తితో ఉంటారు. అలాంటి టైంలో యేసు ఇచ్చిన ఓ సలహా మేరకు బాబు తను చేసే డెలివెరీ ఇంట్లోనే దొంగతనం చేయాలని అనుకుంటాడు. అయితే అలాంటి టైంలో బాబు డెలివెరీ ఇచ్చిన ఇంట్లో ఓ శవం ఉంటుంది. ఈలోగా మత్తులోకి వెళ్లిన బాబు తను ఏం జరిగిందో గుర్తుతెచ్చుకుంటాడు. ఇంతకీ బాబు వల్లే అతను చనిపోయాడా..? అసలు యేసు ఇచ్చిన సలహా ఏంటి..? బాబు, యేసులు ఫైనల్ గా ఏం చేశారు అన్నది సినిమా కథ.

 

విశ్లేషణ :

 

తెలుగులో ఈమధ్య కొత్త కథలు వస్తున్నాయి. అలాంటి కథలను ప్రేక్షకులు సైతం హిట్ చేస్తున్నారు. మత్తువదలరా సినిమా కూడా అలాంటి కోవకే చెందినదని చెప్పొచ్చు. రితేష్ రానా కథ, కథనాలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. కథ చాలా చిన్న పాయింట్ అనిపించినా కథనం నడిపించిన తీరు మెప్పిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ ఇలా ఈ మూడు అంశాల్లో అదరగొట్టారు.

 

సినిమా మొదలైన కొద్దిసేపట్లోనే ఆడియెన్ కనెక్ట్ అవుతారు. స్టోరీ, స్క్రీన్ ప్లే రెండు చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు రితేష్ రానా. మొదటి సినిమా అయినా సరే అతని విజన్ బాగుందని చెప్పొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఆడియెన్స్ ను కథలో ఇన్వాల్వ్ చేయించే సత్తా ఉంటేనే అలాంటి సినిమాలు హిట్ అవుతాయి.

 

మత్తువదలరా సినిమా అందుకు బెస్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. సినిమా కథకు అవసరం లేని విషయలాను టచ్ చేయకుండా సినిమా అంతా ఒకే పంథాలో నడిపించాడు. కథకు తగినట్టుగా కాస్టింగ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. మొత్తానికి కొత్త సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు మత్తువదలరా నచ్చుతుంది.

 

నటీనటుల ప్రతిభ :

 

కీరవాణి తనయుడు simha KODURI' target='_blank' title='శ్రీ సింహా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రీ సింహా ఈ కథకు బాగా సూట్ అయ్యాడు. సినిమాలో భయం, కోపం, చిరాకు ఇలాంటి సందర్భాల్లో తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమానే అయినా ఎంతో పరిణితితో నటించాడు శ్రీ సిం హా. ఇక ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు సత్య. అగస్త్య కూడా బాగానే చేశాడు. వెన్నెల కిశోర్, బ్రహ్మాజి పాత్రలు మెప్పించాయి.

 

సాంకేతికవర్గం పనితీరు :

 

సినిమా కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. కాళ భైరవ మ్యూజిక్ ఆకట్టుకుంది. బిజిఎం కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. కథ, కథనాల్లో దర్శకుడు మంచి ప్రతిభ కనబరిచాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్ :

 

స్టోరీ

స్క్రీన్ ప్లే

కాస్టింగ్

మ్యూజిక్

 

మైనస్ పాయింట్స్ :

 

మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్

 

బాటం లైన్ :

 

మత్తువదలరా.. సస్పెన్స్.. థ్రిల్.. ఎంటర్టైనింగ్..! 

 

రేటింగ్ : 3/5

మరింత సమాచారం తెలుసుకోండి: