తనని ఎవరైనా ఏదైనా అంటే  నోరుమూసుకుని సైలెంట్ గా ఉండడం అనేది రామ్ గోపాల్ వర్మ కి ఏ మాత్రం చేతకాని విషయం. రామ్ గోపాల్ వర్మ అనే వివాదాస్పద మైన దర్శకుడు ని ఎవరైనా కెలికితే ఎందుకు ఆయన జోలికి వెళ్ళాము రా బాబు అనుకునేలా పక్కా చేస్తాడు. ప్రస్తుతం జరిగింది అదే.


లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయం లో డైరెక్టర్ ఆర్జీవీ , ఏపీ అగ్రికల్చరల్ మినిస్టర్ సోమిరెడ్డి ల మధ్యన తీవ్ర వివాదం జరుగుతోంది. సోమిరెడ్డి తత్తన సినిమా గురించి చేసిన వ్యాఖ్యల పట్ల రియాక్ట్ అయిన వర్మ ఆయనకి గట్టి సమాధానమే ఇచ్చాడు అని చెప్పవచ్చు.


"మై రిప్లైస్ టు ది గ్రేట్ హానరబుల్ టీడీపీ అగ్రికల్చర్ మినిస్టర్ మర్యాద తిమ్మన్న సోమిరెడ్డి గారి కామెంట్స్ కు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విడిచారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, వాటికి తన సమాధానాలు చెప్పాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర లో తనని హీరోగా పెట్టాలి అని కోరిన సోమిరెడ్డి కి వర్మ ఘాటు సమాధానం చెప్పారు " మీరు హీరో అంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతి గారు చెయ్యను అంటున్నారు.


దీపికా పడుకొనే దగ్గర నుంచీ అగ్రికల్చరల్ పొలాలలో పనిచేసే స్త్త్రీ కూలీల వరకూ అందరినీ అడిగి చూసాను. వారి సమాధానాలు వింటే మీరు ఉరివేసుకుని చస్తారు. అలాంటి ఆలోచన మీరు మానుకోవడమే మంచిది" అంటూ రామూ ఒక్క దెబ్బతో సోమిరెడ్డి కి షాక్ ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: