ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో సినీ తారలపై బయోపిక్ చిత్రాలు బాగానే వస్తున్నాయి. తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘మహానటి’ తెరకెక్కించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో కూడా మహానటి మంచి కలెక్షన్లు రాబట్టింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రణబీర్ కపూర్ ముఖ్య పాత్రలో ‘సంజు’ చిత్రం తెరకెక్కుతుంది.
సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సంజు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంజయ్ దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడా చూపెట్టనున్నామని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలనాటి స్టార్ హీరో, హీరోయిన్లు అయిన సునీల్ దత్, నర్గీస్ కుమారుడు సంజయ్ దత్. సంజయ్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ తల్లి, అలనాటి ప్రముఖ నటి నర్గీస్ పాత్రలో మనీషా కొయిరాల నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఇటీవల షేర్ చేసిన పోస్టర్లో మనీషాను చూసిన జనాలు అచ్చం నర్గీస్లానే ఉందంటూ కామెంట్లు చేశారు.
తాజాగా 1970నాటి నర్గీస్‌ను గుర్తుకు తెచ్చేలా.. అదే హెయిర్ స్టైల్, అదే చీర కట్టుతో కూడిన తన ఫొటోను మనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాజాగా ఈ పోస్ట్ చూసి నెటిజన్లు అచ్చం నర్గీస్ లా ఉందని కాప్లిమెంట్స్ ఇస్తున్నారు.