బిగ్ బాస్ సీజన్ 3కి ఇప్పటి వరకు సరైన కంటెస్టెంట్స్  దొరకడం లేదని లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే ఎంతోమందిని ట్రయ్ చేస్తున్నా కానీ అధికారికంగా ఫైనల్ అయినవారు ఎవరూ లేరు. రెండో సీజన్ కు కూడా సరైన పేరు రాలేదన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు మూడో సీజన్ కు కాస్త పేరున్న సెలబ్రిటీలను తీసుకుందాం అంటే చాలానే అడ్డంకులు వస్తున్నాయని ఇన్‌సైడ్ టాక్. సినిమా సెలబ్రిటీస్‌కు 100రోజులు వేరే పని మీద వుండిపోవడం అంటే కుదిరేపనికాదు. బయట షూటింగ్ లు కేవలం బిగ్ బాస్ కోసం వదులుకుంటే కెరీర్ పరంగా అంత పెద్ద డామేజే జరుగుతుంది. 

అంతేకాకుండా 100 రోజుల పాటు ఫోన్ కు దూరంగా వుండడం అన్నది కూడా పెద్ద సమస్యే. మొబైల్ అడిక్షన్ భయంకరంగా వున్న ఈ కాలంలో ఫోన్ లేకుండా వందరోజులు వుండడం అంత చిన్న విషయం కాదు. అప్పటికీ నిర్వాహకులు రోజుకు ఓసారి ఒకటి రెండు ఫోన్ లు చేసుకునే అవకాశం ఇస్తామని చెబుతున్నారట. 
ఆ విధంగా ఇంట్లో వారితో టచ్ లో వుండొచ్చు. కానీ సెలబ్రిటీలు, చిన్న అయినా, పెద్ద అయినా, బయట వ్యవహారాలు ఒకటీ రెండూ కావు. అందుకే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. 

సరైన అవకాశాలు లేనిచోటా మోటా నటులు, యాంకర్లు, సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నవాళ్లు మాత్రమే వడపోతలో మిగులుతున్నారు. కేవలం వారిని పెట్టుకుని, నాగార్జున లాంటి పెద్ద హీరో ను హోస్ట్ గా తీసకుని ఏం చేసుకోవాలి. అవతలి వాళ్ల రెస్పాన్స్, బ్యాగ్రౌండ్ ఇవన్నీ బాగుంటే హోస్ట్ బాగా చేయడానికి వీలవుతుంది. లేదంటే షోలో కిక్ ఉండదు. బిగ్ బాస్ టీమ్ ఎంతమందిని అప్రోచ్ అవుతున్నా, ఎక్కువ మంది నో చెప్పడానికి కారణం 100 రోజులు కావడం, అలాగే మొబైల్ వదిలేయాల్సి రావడమే అసలు కారణాలుగా కనిపిస్తున్నాయి. దానికితోడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు వగైరా తలనొప్పులు వుంటాయి. అందుకే బిగ్ బాస్ 3 కి సరైన కంటెస్టెంట్ లు దొరకడం లేదని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: