సహజంగా వేలంలో పురాతన వస్తువులు అమ్ముడుపోతాయి. లేదంటే బట్టలు, బంగారపు గిన్నెలు, ఇంకాస్త ఆలోచిస్తే వినాయక చవితి రోజున లడ్డూలకి వేలం పెడుతారు. కానీ అమెరికాలో మాత్రం ఒక అరటిపండు మాత్రం ఏకంగా 85 లక్షలకి అమ్ముడుపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. అదేంటి ఒక్క అరటిపండి అంత ఖరీదు చేస్తుందా అదేమన్నా పురాతన పండు కాదు, అంత పురాతనమినదే అయితే ఇప్పటి వరకూ ఉండదు కదా అంటూ ఆలోచనలు మాని అసలు విషయంలోకి వెళ్దాం..

Image result for duct-taped-banana-art-sold-for-rs-85-lakh-in-miami

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఆర్ట్ బాసెల్ పేరుతో ప్యారిస్ కి చెందిన పెరోట్రిన్ ఆర్ట్ గ్యాలరీ ఫౌండేషన్ దీన్ని మియామి బీచ్ లో ప్రదర్సనకి పెట్టింది. ఈ గ్యాలరీలో ఒక ఆర్ట్ ఎంతాగో అందరిని ఆకట్టుకుంది. అదేంటంటే ప్రఖ్యాత కళాకారుడు అయిన మారిజియో కాటలాన్ అనే ఇటాలియన్ కళాకారుడు ఒక అరటిపండుని గోడకి ప్లాస్టర్ తో అమర్చాడు. కమెడియన్ గా పిలిచే ఈ అరటిపండు బొమ్మని టేప్ తో అతికించి ఉంచాడు.

 

దాంతో అందరి చూపు ఆ ఆర్ట్ మీదవైపుకి వెళ్ళింది. మియామి ప్రాంతంలో కొన్న అరటి పండు ఆర్ట్ ఇంతటి ఖరీదులో అమ్ముడుపోవడం ఏమిటో ఇప్పటికి ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది. అంతేకాదు ఇప్పుడు ఆ ప్రాంతంలో దీనిపైనే చర్చ జరుగుతోందట. ఈ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సైతం ఈ అరటిపండుకి ధృవీకరణ సర్టిఫికేట్ కూడా ఇచ్చారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: