అమెరికాలో కరోనా కోరలు చాస్తున్న సమయంలో లక్షమందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే సుమారు 5 లక్షలమందికి పైగా కరోనా బారి నుంచీ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలోనే భారతీయ వైద్యుల సేవలని అమెరికా గుర్తించింది. ఎంతో మంది భారతీయ వైద్యులు అహర్నిశలు కష్టపడి పనిచేసిన తీరు అమెరికా ప్రజలని ప్రభుత్వాన్ని మెప్పించింది దాంతో నలుగురు ఎంపీలు 40 వేల గ్రీన్ కార్డులని వైద్యులు, నర్సులు లకి ఇవ్వాలని సెనేట్ లో బిల్లు ప్రతిపాదించారు.

 

త్వరలో ఈ బిల్లు సెనేట్ లో చర్చకి రానున్న నేపధ్యంలో ఇప్పుడు భారత సంతతి వైద్యులు, సిబ్బంది సెనేటర్ల మద్దతు ఈ బిల్లుకు ఉండాలని కోరుతున్నారు. అంతేకాదు సెనేటర్ల వద్దకి భారతీయ వైద్యులు, నర్సులు వెళ్తూ ఈ బిల్లుకి మద్దతు తెలుపాలని క్యూలు కడుతున్నారు. ఇదిలాఉంటే ఈ బిల్లు గనుకా ఆమోదం పొందితే అత్యధికంగా లాభపడితే భారతీయులేనని అంటున్నారు అమెరికన్ సోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అధ్యక్షడు సురేష్.

 

భారత సంతతికి చెందిన దాదాపు 10 వేల మంది ఫిజీషియన్ లకు గ్రీన్ కార్డ్ లభిస్తుందని ఆయన అంటున్నారు. ఈ బిల్లు గనుకా కార్య రూపం దాల్చితే తెలుగు వైద్యులు, వైద్య నిపుణులుకి కూడా న్యాయం జరుగుతుందని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డులు అందుతాయని హైదరాబాద్ కి చెందిన ప్రముఖ ఎన్నారై వైద్యులు అంటున్నారు. ఎంతోమంది ఎన్నారై వైద్యులు దశాబ్ద కాలంగా గ్రీన్ కార్డ్ కి అప్ప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారని ఈ బిల్లు గనుకా సెనేట్ లో ఆమోదం పొందితే ఎంతో మంది భారతీయ వైద్యుల కలలు నిజమవుతాయని అంటున్నారు నిపుణులు. అయితే ఈ బిల్లుకి ఎంతమంది సెనేటర్లు మద్దతు ఇస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కానీ నిపుణుల అంచనాల ప్రకారం కరోనా ప్రాభవాన్ని తగ్గించడంతో భారతీయ వైద్యుల పని తీరు సేనటర్లకి కూడా తెలుసునని తప్పకుండా బిల్లు ఆమోదం పొందుతుందని అంటున్నారు..,

 

మరింత సమాచారం తెలుసుకోండి: