సింగపూర్ ప్రధాన మంత్రి ఏంటి.. కేసీఆర్‌ కూ లింక్ ఏంటి అనుకుంటున్నారా.. అవును సింగపూర్ ప్రధానమంత్రి కూడా కేసీఆర్ తరహాలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2018 చివర్లో కేసీఆర్ ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన పదవీ కాలం ఇంకా ఉండగానే ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు.

 

 

ఇప్పుడు సింగపూర్ ప్రధాని లీ షియాన్ లూంగ్ కూడా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన టెలివిజన్‌లో ప్రజలను దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సింగపూర్ పార్లమెంటు రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిట్ జారీ చేయాలని అధ్యక్షుడు హాతలీమా యాకోబ్‌కు విజ్ఞప్తి చేశారు.

 

 

ఎన్నికల నిర్వహణతో ప్రస్తుతం పాలనలో ఎదురవుతున్న అవాంతరాలు తొలగిపోతాయని.. నూతన ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు సింగపూర్ అభివృద్ధి అజెండాతో పనిచేసేందుకు వీలు కలుగుతుందని లీ షియాన్ పేర్కొన్నారు. అయితే లీ షియాన్ నిర్ణయం ఆ దేశ రాజకీయ వర్గాల్లో కలకలమే రేపుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందోనన్న ఆందోళన సొంత వర్గంలోనూ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: