కానీ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు. రోజురోజుకు రష్యా తమ దాడుల సంఖ్యను పెంచుతుంది తప్ప ఎక్కడ తగ్గించడం లేదు. ఇక ఇటీవల కాలంలో బాలిస్టిక్ క్షిపణిలతో దాడి చేయడం మొదలుపెట్టింది రష్యా. దీంతో అటు ఉక్రెయిన్ లో మారణహోమం జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఎప్పటికప్పుడు దేశ సైనికులలో ఉత్సాహం నింపేందుకు దేశపౌరుల అందరిలో కూడా ధైర్యం నింపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రయత్నిస్తూ నే ఉన్నారు. ఇక ఇటీవలే మీడియాతో మాట్లాడిన జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రష్యా తో కలిసి తమ దేశంపై దాడి చేసేందుకు బెలారస్ సిద్ధమవుతోంది అంటూ ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తమ నిఘా వర్గాల మధ్య దీనికి సంబంధించి పక్కా సమాచారం ఉంది అంటూ తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం రష్యా చేస్తున్న సైనిక పరమైన చర్యలను అడ్డుకునేందుకు ఎన్నో రోజుల నుంచి ప్రపంచ దేశాల సహాయం కోరుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రష్యా దాడి నేపథ్యంలో ఇదే విషయంపై ఇజ్రాయిల్ పార్లమెంటులో కూడా ఈ విషయంపై ప్రసంగించనున్నారు జెలెన్ స్కీ. ఇప్పటికే యూఎస్ సభలతో పాటు యూరోపియన్ పార్లమెంటులో కూడా ఇదే విషయంపై సభ్యులందరితో మాట్లాడారు జెలెన్ స్కీ..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి