
ముఖ్యంగా టర్కీలో ఇక భారీ భవనాలు కూలిపోవడంతో ఇక ఆ భవనాల శిధిలాల కింద నుంచి మృతదేహాలు వెలిక్కితీస్తూ ఉన్నారు అధికారులు. ఇప్పటికే దాదాపు 11 వేలకు పైగానే మృతదేహాలను వెలిక్కి తీశారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టర్కీ భూకంపంకి సంబంధించి ఎన్నో వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఎంతోమంది గుండెల్ని పిండేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటో ఒకటి ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది అని చెప్పాలి. భూకంపం దాటికి భవనాలు పేక మెడల్ల కూలిపోయిన నేపథ్యంలో ఇక తమ ప్రియమైన వారి మృతదేహాల కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు ఈ భూకంపం నుంచి బయటపడిన మృతుల కుటుంబ సభ్యులు.
ఇలా కూలిపోయిన భవన శిథిలాల కింద తన కూతురిని కోల్పోయిన ఒక తండ్రి ఫోటో ఇక అందరిని భావోద్వేగానికి గురిచేస్తుంది అని చెప్పాలి. భూకంప సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న 15 ఏళ్ల ఇర్మాక్ అనే అమ్మాయి భూకంపం నేపథ్యంలో ఇక భవనం కూలిపోతుందో శిథిలాల కింద పడి మరణించింది. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ తండ్రి మోసుడ్ హన్సర్ ఇక శిధిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయిన తన కూతురు చెయ్యి పట్టుకుని దీనంగా చూస్తున్న ఫోటో ఎంతోమందిని కన్నీరు పెట్టిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే భూకంపం సంభవించి రోజులు గడుస్తున్న ఇంకా మరణాల సంఖ్యను అంచనా వేయలేకపోతున్నారు అధికారులు.