
దాంతో అప్పటి నుంచి వాళ్లకు సంబంధం లేకుండా పోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆనాటి అధ్యక్షుడు ఇచ్చిన ప్రకటన ఏంటంటే భారత్ ను వెయ్యి ముక్కలు చేస్తాం అని. దానిలో భాగంగానే కాశ్మీర్ ను, పంజాబ్ ను, బెంగాల్ ను విభజించే ఆలోచన మొదలైంది వాళ్ళకి. అసలు దీనికంతటికీ కారణం రాజ్యాంగంలోని 370ఆర్టికల్ ప్రకారం పాకిస్తాన్ ను వేరు చేయాలను కోవడం. అసలు రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్స్ 370ని ఎందుకు రద్దు చేయాలనుకున్నారు. ఆర్టికల్ 370 35a మోడీ వచ్చిన తర్వాత రద్దు అయ్యాయి.
అలా భారత్ దౌత్య పరంగా సక్సెస్ అయిందని తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని మరింత చట్టబద్ధం చేసేందుకు, కాశ్మీర్ అనేది భారత్ లో అంతర్భాగమని ప్రపంచానికి తెలియడం కోసం జీ-20సమావేశాలను కాశ్మీర్ లో పెడుతున్నట్టుగా తెలుస్తుంది. జీ-20దేశాలతో పాటు మరో 30దేశాలు కూడా గెస్ట్ గా వచ్చే ఈ సమావేశాలను డిస్టర్బ్ చేయడం కోసం పాకిస్తాన్ మొన్న కాశ్మీర్లో దాడులు చేసిందని తెలుస్తుంది.
అయినా సరే పట్టించుకోకుండా ముందుకు వెళుతున్న భారత్ ను చూసి పాకిస్తాన్ తన ప్లాన్ మార్చుకుంది. కాశ్మీర్ మాది అంటూ మిగిలిన దేశాలన్నిటికీ చెప్తూనే మీరు ఆ జీ-20సమావేశాలకు వెళ్ళకండి అని అడుగుతుందట. కానీ బ్రిటన్ ప్రధాని రుషి సనక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశానికి వెళ్లి తీరుతానని చెప్తున్నారట.