కాలం కలిసి రావాలే కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది అన్నది ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్న.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు వస్తాడు అన్నట్లు.. కాలం కలిసి వచ్చింది అంటే చాలు కడు పేదరికంలో ఉన్న వాళ్ళు సైతం రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోతూ ఉండడం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నామ్.


 అయితే డబ్బు సంపాదించాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేస్తూ కష్టపడి డబ్బు సంపాదించాలని అనుకుంటే.. ఇంకొంతమంది వ్యాపారం చేసి కాస్త రిస్క్ చేసైనా ధనవంతులు కావాలని ఆశపడుతూ ఉంటారు. మరి కొంతమంది స్టాక్ మార్కెట్స్ జోలికి వెళ్లి చేతులు కాల్చుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం ఎంతో సులువుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ చివరికి కోటీశ్వరులుగా మారిపోతూ ఉంటారు. అదెలాగో తెలుసా లాటరీల ద్వారా.


 ఇటీవల కాలంలో ఎంతోమంది సరదా కోసం తీసుకున్న లాటరీలతో కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ గెలుచుకుని రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవల యూఏఈ లో కూడా లాటరీల పుణ్యమా అని మధ్యతరగతి కి చెందిన భారతీయులు కోటీశ్వరులు అవుతున్నారు. ఇటీవల ఒక భారతీయుడికి జాక్పాట్ తగిలింది. కేరళకు చెందిన శ్రీజూ లాటరీలో 45 కోట్లు గెలుచుకున్నాడు. ఆయన గత 11 ఏళ్లుగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అయితే దాదాపు మూడేళ్ల నుంచి mahzooz draw లో లాటరీ కొంటూ  తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఎట్టకేలకి అదృష్టం వరించింది. వచ్చిన డబ్బుతో స్వగ్రామంలో ఇల్లు కట్టుకుంటాను అంటూ చెబుతున్నాడు శ్రీజు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mri