ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఇక పెరిగిపోయిన టెక్నాలజీ కారణంగా ప్రతి పని కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక పెళ్లి విషయంలో కూడా ఈ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడైతే ఇక ఎవరో పెళ్లిళ్ల పేరయ్యని పిలుచుకుని మంచి సంబంధం ఉందా లేదా అని కనుక్కొని.. ఒకవేళ మంచి సంబంధం ఉంటే వెళ్లి పెళ్లి చూపులు చూసి.. ఇక ఆ తర్వాత కట్న కానుకలు మాట్లాడుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేవారు.


 కానీ ఇటీవల కాలంలో మాత్రం పెళ్లి ప్రాసెస్ పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్లడం కాదు ఏకంగా ఆన్లైన్లో మ్యాట్రిమోనీ సైట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. వధూవరులు ఏం చదువుకున్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. ఇక ఇలా మ్యాట్రిమోనీ సైట్లలో ఉన్న డేటా ఆధారంగానే పెళ్లి సంబంధాలు కూడా సెట్ చేసుకుంటున్నారు చాలామంది.


 అయితే ఇప్పుడు వరకు ఎంతో మంది అమ్మాయిలు ఏకంగా వరుడు కావాలి అంటూ ప్రకటన చేయడం చూశాము. కానీ ఇక్కడ ఏకంగా 112 ఏళ్ల బామ్మ తనకు పెళ్లి చేసుకోవడానికి వరుడు కావాలి అంటూ ఒక ప్రకటన చేసింది. ఇక ఈ ప్రకటన కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఏడుగురిని పెళ్లి చేసుకున్న సితి హవా హుస్సేన్ ఎవరైనా ప్రపోజ్ చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రకటించింది. ఆరోగ్యంగా ఉన్న ఆమె తన పనులు తానే చేసుకుంటుంది. ఇక ఈ మొత్తంగా ఆమెకు 7 సార్లు పెళ్లి కాగా.. ఏడుగురు భర్తల్లో కొందరు చనిపోగా మరికొందరు విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఐదుగురు సంతానం కాగా 19 మంది మనవళ్లు మనవరాళ్లు, 30 మంది ముని మనవళ్లు ముని మనవరాళ్లు ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: