రాజ్ భవన్ లో హేవళాంబినామ సంవత్సరం ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ దంపతులు, అనేక మంది అతిథులు హాజరయ్యారు.  విందు తర్వాత అందర అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  ఇక  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం మొదలు పెడుతూ..ఈ సంవత్సరం అన్నీ శుభాలే జరగబోతున్నాయని నవ్వుతూ చిన్న చమక్కు వదిలారు.  

‘మంచి  ''మంచి వర్షం, మంచి కరెంట్.. మంచి పంటలు.. అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.. ఇప్పుడే ఓ మంచి వార్త కూడా వచ్చింది.. దీంతో పరిపాలనకు ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లే'' అంటూ ముగించారు చంద్రబాబు.  ఆయన ప్రసంగం విన్న అందరూ అవాక్కయ్యారు..ఇప్పుడే అంత తీపికబురు ఏంటా అని అనుకుంటున్నారు.  

అయితే దీని వెనుక మరో ఆంతర్యం ఉందట..జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించిందంటూ అంతకుముందే తెలుగురాష్ట్రాల్లో ఓ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. చాన్నాళ్లుగా అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేస్తున్న జగన్.. ఇక కోర్టు కేసులతో బిజీ అయిపోతారని.. ఇక ఏపీలో రూలింగ్ పార్టీ ఆరామ్‌గా 'బతికెయ్యొచ్చని' తెలుగుదేశం వర్గాల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: