భారత దేశానికి ఇద్దరు ప్రధానులు ఉండాలట.. కాశ్మీర్‌కు ఒక ప్రధానమంత్రి, మిగిలిన దేశానికి ఒక ప్రధాన మంత్రి ఉండాలట. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చెబుతున్న తాజా మాట. 


ఈ ఒమర్ అబ్దుల్లా ఎవరో కాదు.. మొన్న ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఫరూక్ అబ్దుల్లా కొడుకే. ఏపీ ప్రచారానికి వచ్చి తనను సీఎం చేస్తే.. జగన్ నాకు 1500 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని ఆరోపణలు చేసింది ఈ ఫరూక్ అబ్దుల్లానే. 

ఇప్పుడు ఆయన కొడుకు ఫరూక్ అబ్దుల్లా ఈ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఇండియా నుంచి పాకిస్తాన్ లాక్కున్న పాక్ ఆక్రమిత కాశ్మర్‌ కు ఓ ప్రధానమంత్రి ఉంటాడు. ఆ ప్రాంతం పాక్ పాలనలోనే ఉన్నా.. పేరుకు ఓ ప్రధానమంత్రిని ఉంచుతారు.

అదే తరహా ట్రీట్ మెంట్ జమ్మూకశ్మీర్‌కూ ఉండాలంటున్నాుడు ఒమర్ అబ్దుల్లా. మరి ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండటం సాధ్యమేనా.. అసలు ఆ అవసరం ఉందా. ఇలాంటి తలతిక్క వాదనలతో నేషనల్ కాన్పరెన్స్ వంటి పార్టీలు కాశ్మీరీలను దేశానికి దూరం చేయడం కాదా.. వారే ఆలోచించుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: