పచ్చపార్టీ పచ్చ మీడియా సహాయంతో చేయని దురాగతాలు లేవు - మొదట నాయకుని నోటి నుండి రాలిన అబద్ధాల ఆణిముత్యాలను నేల రాలకుండా వడిసి పట్టేసి వాటికి రంగులు అద్ది మసాలాతో వండివర్చేసి ప్రేక్షక జనావళికి వడ్దించేవరకు విశ్రమించని మీడియా అది. ఎంతటి అవమానాన్నైనా, అసహనాన్నైనా, జనధిక్కారాన్నైనా ఆ పచ్చనేత పచ్చపార్టీ చివరకు సామాజికవర్గం కోసం సహించగలగటం ఆ మీడియా సహజగుణం. దేశం కోసం మాత్రం కాదు.

చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయంకోసం పచ్చ పార్టీ - పచ్చమీడియా - పచ్చ సామాజికవర్గం ఆంధ్రప్రదేశ్ పై ముప్పేట దాడి కొనసాగించటం ప్రారంభించింది. అంతా ఒకటయ్యారు అలాగే బాబు వ్యూహం ప్రకారం వివిధ రాష్ట్రాల నాయకులు కులాలవారీగా రాష్ట్ర జనంపై ఉపన్యాసాలతో హోరెత్తిస్తున్నారు. ప్రజలు తనను తన మీడియాను తన సామాజికవర్గ వ్యక్తులను నమ్మట్లేదని గ్రహించిన చంద్రబాబు ప్రక్క రాష్ట్రాలనుండి మమత బెనర్జి, అరవింద్ కేజ్రివాల్, ఫరూక్ అబ్దుల్లా వంటి వాళ్ళను రాష్ట్రానికి రప్పిస్తూ రోజుకో వేషం రోజుకో వ్యూహంలా కుతిల కుతంత్ర కుశ్చిత రాజకీయ విషాన్ని ప్రజల్లోకి ప్రవహింపజేస్తున్నారు.

you tube channels that supports TDP కోసం చిత్ర ఫలితం

సీఎస్డీఎస్ లోక్-నీతి సర్వే అంటూ ఆ తెలుగు జ్యోతి దిగజారి తాను ఆరిపొయినా తన పార్టీ గెలవాలన్న తాపత్రయంతో నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది. జనబాహుళ్యం చీకొడుతున్నా చింతించని దాని స్వభావం ఆంధ్ర ఆక్టోపస్ పేరుతో తెలంగాణా శాసనసభ ఎన్నికల సమయంలో వెలువరించిన సర్వేతో సర్వం పాతివ్రత్యం కోల్పోయినా తిరిగి ఆ క్రమలోనే వారి సామాజిక ఇంటర్నెట్ మీడియా కూడా తనదైన శైలిలో ప్రచారం ప్రారంభించింది. 


తాజాగా మరో  కుత్సిత కుతంత్ర సర్వే ప్రకటించి -  సిగ్గు శరం చీము రక్తం వదిలేసి తెలంగాణా ఇంటెలిజెన్స్ పేరుతో మరో దుర్మారగపు సర్వే ద్వారా తెలుగుదేశం పార్టీ ఏపిలో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రానుందని ప్రకటించేసింది. 
you tube channels that supports TDP కోసం చిత్ర ఫలితం
అదే తరహాలో ఏపీ ప్రజలను దగా చెసేందుకు మరోసారి ప్రయత్నించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలపై "తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం" సర్వే నిర్వహించారని, అందు లో టీడీపీ భారీ ఆధిక్యంతో గెలుస్తున్నట్టుగా తేలిందంటూ యూట్యూబ్‌లో హైదరాబాద్‌కు చెందిన "టీఎఫ్‌సీ మీడియా" అనే ప్రైవేటు కంపెనీ ఒక దొంగ సర్వేను ప్రసారం చేసింది.


దీన్ని గుర్తించిన "తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ హరిప్రసాద్‌" జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై హరిప్రసాద్‌ తమ డిపార్ట్‌మెంట్‌ లో ఆరా తీయ గా ఏపీ ఎన్నికపై తెలంగాణ నిఘా విభాగం ఎలాంటి సర్వే నిర్వహించలేదని, కానీ వారి ప్రచారానికి తమ శాఖ పేరును వాడు కుంటున్నారని అందులోపేర్కొన్నారు. 
you tube channels that supports TDP కోసం చిత్ర ఫలితం
దీంతో ఈ బోగస్‌ వార్త విషయాన్ని హరిప్రసాద్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌కు చెందిన ఈ కంపెనీ డైరెక్టర్‌ శాఖమూరి తేజోభాను, ఇతర డైరెక్టర్లపై ఐటీ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో టీడీపీ అనుకూల వాదుల మరో ఎత్తుగడ బట్టబయలైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


ఈ విధంగా దొంగ సర్వేలతో ఏపీ ఓటర్లను మభ్యపెట్టి వారిని మానసికంగా తప్పుదారి పట్టించి టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా చేయాలని కుట్ర పన్నారని, ఇందుకోసం తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పేరును వాడుతూ ఆ విభాగం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని తెలిపారు.


టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రామకృష్ణ వీరపనేని నేతృత్వంలోని "మ్యాంగో అండ్‌ వాక్డ్‌ అవుట్" అదుగాని మల్లేష్‌ నేతృత్వంలోని "చాలెంజ్‌ మిత్ర" చీపురుపల్లి రాంబాబు నేతృత్వంలోని "టాలీవుడ్‌ నగర్‌" సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు, వారితో కలిసే ఈకుట్ర చేసినట్లు ఆరోపించారు. హరిప్రసాద్‌ తన ఫిర్యాదుతో పాటు యూట్యూబ్‌ లింకులు, అందులో పొందు పర్చిన అంశాలకు సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. 


వీటిని పరిశీలించి పరిగణనలోకి తీసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ 171 (సీ), రెడ్‌విత్, 171 (ఎఫ్‌), 171 (జీ), 417, 420, 465, 468, 471, 505(1), (సీ), 505(2), రెడ్‌విత్‌ 120(బీ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 66 (డీ) కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.బాలకృష్ణారెడ్డి నేత్రుత్వంలో ఈ కేసు దర్యాఫ్తు ప్రారంభించారు. 
youtube telugu political channels & logos కోసం చిత్ర ఫలితం
ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి టీఎఫ్‌సీ సంస్థ 2016 నవంబర్‌ 15 నుంచి పనిచేస్తున్నట్లు, శాఖమూరి తేజోభాను తదితరులు డైరెక్టర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36 లోని "ఎన్‌బీకే బిల్డింగ్, సాగర్‌ సొసైటీ" అడ్రసులతో ఈ సంస్థ పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ సంస్థల నిర్వాహకులు టీడీపీతో, దాని కీలక నేతలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు, దాదాపు అందరూ ఒకే సామాజిక వర్గానికే చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది.


గతంలో టీడీపీ నేతలకు అనుకూలంగా, వైసిపి  నాయకులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా లో జరిగిన ప్రచారానికి కూడా వీరే బాధ్యులని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపు లోకి తీసుకున్నట్లు, ఇంకా కొందరు ముద్దాయిల కోసం వేట సాగిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: