చంద్రబాబు ఆరోగ్యం విషయం  పలుసార్లు చర్చకు వచ్చింది. కానీ చంద్రబాబు మిగతా వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల కోసమంటూ అమెరికాకు వెళుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ఏదో విహారయాత్రకు యూఎస్ వెళ్తుంటే దానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉండేది కాదేమో! అయితే చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల నిమిత్తం యూఎస్ కు వెళ్తున్నాడనే వార్త పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది.


ఏదో సాధారణ వైద్య పరీక్షలే అయితే వాటికోసమే ప్రత్యేకంగా అమెరికా వరకూ వెళ్లే పరిస్థితి ఉండదని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు కూడా. ఇంతలోనే ఆయన అమెరికాకు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్తున్నారట. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఇదివరకే పలువురు ఏపీ రాజకీయ నేతలు వివిధ రకాల వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబు నాయుడు స్కిజోఫ్రినియాతో సతమతం అవుతున్నాని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఇదివరకే వ్యాఖ్యానించారు. ఆ ప్రజా జీవితంలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి కూడా ప్రజల్లో చర్చనీయాంశమే. అమెరికాలో అయితే నేతలు తమ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ప్రకటించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల గురించి తెలుగుదేశం పార్టీ ఏదైనా ప్రకటన చేస్తుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: