మన తెలంగాణ ఇప్పుడు పారిశ్రామిక రంగంపైపు చూస్తుందని..తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్‌ జిల్లా పటాన్‌ చెరులోని డెక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమలో బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్‌   ప్రారంభ సందర్భంగా అన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో 25వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు. డెక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమ మరింత విస్తరించాలని ఆకాక్షించారు. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి ఈ గడ్డపై తన అభిమానాన్ని చాటుకున్న డెక్కన్ ఆటో మొబైల్  ఎండిని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు.

మీటింగ్ లో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్


ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఒకసారి ఎపిఎస్ఆర్ టిసి అని అన్నారు. .ఈ బస్ యూనిట్ కు మూడు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చాయని, వారికి తనతో తాళాలు అందచేయించారని, త్వరలోనే ఎపిఎస్ ఆర్టిసి నుంచి కూడా ఆర్డర్లు వస్తాయని అన్నారు. పక్కనున్న అధికారులు ఏపీకాదు టీఎస్ అనగానే వెంటనే సర్ధుకొని అరె... ఇంకా పాత వాసన పోవట్లే.. నవ్వుతూ  అంతర్జాతీయ స్థాయిలో దక్కన్ బస్ బాడీ పరిశ్రమను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: