వైసీపీ కీల‌క నాయ‌కుడు.. ప్ర‌ధానంగా దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ప్ర‌ధాన అనుచ‌రుడిగా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు పొందిన తిరుప‌తి ఎమ్మెల్యే,.. సీనియ‌ర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డికి .. వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌ట్టి షాక్ ఇచ్చార‌నే ప్ర‌చారం జోరందుకుంది. వాస్త‌వానికి జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో మెలుగు తూ.. ఆయ‌న‌కు అత్యంత అనుంగు నాయ‌కుడిగా భూమ‌న గుర్తింపు పొందారు. పార్టీని ముందుండి న‌డిపించ‌డ‌మే కాకుండా.. తిరుప‌తి రాజ‌కీయాల్లో ప్ర‌తిప‌క్షానికి చెక్ పెట్టే విష‌యంలోనూ భూమ‌న కీల‌క పాత్ర పోషించారు.

అయితే.. అంద‌రిలానే.. భూమ‌న కూడా త‌న వార‌సుడిని రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేయించారు. తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో భూమన అభినయ్ రెడ్డిని కార్పొరేట‌ర్‌గా గెలిపించుకున్నారు. ఇంత వ‌ర‌కు భూమ‌న స‌క్సెస్ అయిప్ప‌టికీ.. ఆయ‌న‌త‌న కుమారుడిని కీల‌క‌మైన డిప్యూటీ మేయ‌ర్ అయినా చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. ఫ‌లితం ద‌క్క‌లేదు. తిరుప‌తి మేయ‌ర్ ప‌ద‌వి.. రిజ‌ర్వ్‌డ్ కావడంతో ఈ ప‌ద‌విని మ‌హిళ‌కు కేటాయించారు. డాక్ట‌ర్ శిరీష మేయ‌ర్ అయ్యారు. ఇక‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి అయినా ద‌క్కుతుంద‌ని అనుకున్నారు.

కానీ, ఈ డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని కూడా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి రైట్ హ్యాండ్‌గా పేర్కొ నే ముద్ర నారాయ‌ణ‌కు ద‌క్కింది. దీంతో భూమ‌న కుటుంబం ఒకింత నిరుత్సాహంలో కూరుకుపోయిం ది. అయితే.. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వైసీపీ నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు.. ప్ర‌తికార్పొరేష‌న్‌లోనూ రెండో డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని క్రియేట్ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే.. దీనికి చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో తొలుత ఆరు మాసాల‌కు గాను చ‌ట్టం అనుమ‌తించేలా.. ఆర్డినెన్స్‌ను తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు.

అయితే.. ప్ర‌భుత్వం చెబుతున్న దానికి, క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు తేడా ఉండ‌డంతో వైసీపీ నాయ‌కులు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.ఎందుకంటే.. ఆర్డినెన్స్ ఇంకా గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర కు వెళ్ల‌లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై మంత్రులు సంత‌కాలు చేయ‌లేద‌ని అంటున్నారు. ఇదంతా పూర్త‌యి.. ఆర్డినెన్స్ వ‌చ్చే స‌రికి స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఒక వేళ ఈలోగా ఎవ‌రైనా కోర్టు వెళ్లి.. దీనిపై స్టే తెస్తే. ఇది వీగి పోయే ప్ర‌మాదం ఉంద‌ని కూడా ప్ర‌చారంలో ఉంది. ఈ క్ర‌మంలోభూమ‌న వార‌సుడికి ఇస్తామ‌ని ప్ర‌చారంలో ఉన్న రెండో డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్కుతుందా ?  లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా. జ‌గ‌న్ వ్యూహాత్మకంగా.. కీల‌క నేత‌ల‌ను ప‌క్క‌న పెడుతున్నార‌నే వాద‌న ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: