నేడు హరీష్ రావు పుట్టినరోజు. కరోనా నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు. అధికార పార్టీలో ట్రబుల్ షూటర్ అంటే హరీష్ రావు. సీఎం కేసీఆర్‌కు స్వయాన మేనల్లుడు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు వెన్నంటే ఉన్న హరీష్ తొలివిడత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. పార్టీకి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే రంగంలోకి దిగి పార్టీని నిలబెట్టారు. ఎక్కడ పార్టీకి పాలన పరంగా సవాళ్లు ఎదురైనా అక్కడ హరీష్ రావు తన స్ట్రాటజీ వర్తిస్తారు. రాష్ట్రంలో ఎలాంటి కీలక పరిణామం చోటు చేసుకున్నా రంగంలోకి దిగి పరిస్థితులు చక్కబెట్టేస్తారు.  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 26 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల నియోజకవర్గాల్లో హరీష్ రావు ప్లాన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ 26 మంది కీలక కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా హరీష్ రావు ప్లాన్స్ వర్కౌటయ్యాయి. ఈ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రత్యేకంగా హరీష్ రావు ప్రచారం కోసం ఒక్క హెలికాప్టర్ ను కేటాయించారు. 2014 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొండంలో కూడ హరీష్ రావు కీలకపాత్ర పోషించారు.

అందుకే హరీష్ రావు వెన్నంటే ఉంటే కేసీఆర్‌కు కొండంత అండగా ఫీల్ అవుతారు. సిద్దిపేట నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు హరీష్ రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి తెలంగాణలో రెండు సార్లు మొత్తం మూడు సార్లు మంత్రిగా హరీశ్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ ఎస్ లో పనిరాక్షసుడిగా హరీష్ రావుకు పేరుంది. అందుకే కేసీఆర్ ఏరికోరి తెలంగాణ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే బాధ్యతను హరీష్ రావు మీద పెట్టాడు. మామ నమ్మకాన్ని హరీష్ వమ్ము చేయలేదు. జర్మనీ - చైనా ఇంజినీర్లను తీసుకొచ్చి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర జలవనరుల సంఘం అధికారులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్పీడు - టెక్నాలజీ చూసి నోరెళ్లబెట్టారు. హరీష్ పట్టుకుంటే ఆ పని పూర్తయినట్టేనని టీఆర్ ఎస్ లో బలంగా నాటుకుపోయింది. అలాంటి హరీష్ రావుకు దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి జీర్ణించుకోలేని విషయం. ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో కూడా టీఆర్ఎస్‌కు ఓట్లు రాలేదు. దీంతో మంత్రి సైతం షాక్ అయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: