రాజ‌కీయాల్లో ఏ పార్టీకైనా పోటీ త‌ప్ప‌దు. అధికారంలో ఉన్న పార్టీ అయినా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేత‌లైనా.. పోటీగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిందే. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నికల స‌మ‌రానికి సిద్ధం కావాల్సిందే. అయితే.. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైసీపీ దూకుడుగా లేద‌నే టాక్ వినిపిస్తోంది. టీడీపీ హ‌వానే చాప‌కింద నీరులా న‌డుస్తోంద‌ని అటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ దూకుడుగా రాజ‌కీయం చేస్తుంది. కానీ, ప‌శ్చిమ గోదావ‌రి విష‌యానికి వ‌స్తే.. ఆ త‌ర‌హా రాజ‌కీయం క‌నిపించ‌డం లేదు.

ఏలూరు స‌హా.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ క‌న్నా కూడా ప్ర‌జుల ఇంకా టీడీపీ వైపే చూస్తున్నారు. అదేవిధంగా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇంటికే ఇప్ప‌టికీ అనేక మంది వెళ్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే అబ‌య్య చౌద‌రి.. హ‌వా న‌డుస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే వైపు ఎక్కువ మంది రైతులు, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గం దృష్టి సారించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, పాల‌కొల్లులో ఎలాగూ..టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు హ‌వా సాగుతోంది.

ఈయ‌న‌కు ఎక్క‌డా అడ్డు త‌గిలి.. హ‌వా చ‌లాయించే వైసీపీ నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం కూడా ఇటీవ‌ల కాలంలో వైసీపీకి దూర‌మ‌వుతోంది.ఓ  మంత్రి వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఈ వ‌ర్గం.. నిన్న మొన్న‌టి వ‌రకు వైసీపీకి అనుకూలంగా ఉంటే.. ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గుతున్న‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యం లో వైసీపీలో ఇత‌ర నేత‌లు కూడా పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

మంత్రులు రంగ‌నాథ‌రాజు, ఆళ్ల‌నానిల్లో.. నాని త‌న ప‌నేదో తాను చేసుకుని పోతున్నారే త‌ప్ప‌.. పార్టీ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డం లేదు. మంత్రి రంగనాథ రాజు మాత్రం కీల‌క‌మైన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే దృష్టి పెట్టారు. దీంతో వైసీపీ ఇక్క‌డ పుంజుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: