హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. హుజరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మొదలెట్టేశాయి. ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రచారం లో దూసుకుపోతుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఎలాగైనా  ఓడించాలని... టిఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే... అనేక ఎత్తుగడలు వేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగానే కౌశిక్ రెడ్డి మరియు పెద్ద రెడ్డి లను పార్టీలో చేర్చుకుంది టిఆర్ఎస్.ఇక అటు... మరోసారి గెలవాలని మాజీ మంత్రి, బిజెపి  నేత ఈటెల రాజేందర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  అధికార టీఆర్ఎస్ పార్టీ నీ ఎదుర్కునేందుకు  పాదయాత్ర కూడా చేస్తున్నారు.

ఈ పాదయాత్ర నేపథ్యంలో... ఈటెల రాజేందర్ కాలు ఫ్యాక్చర్ అయింది. అయినప్పటికీ ఈటల రాజేందర్ మరో రెండు రోజుల్లో తిరిగి పాదయాత్ర చేయనున్నారు. అయితే ఇప్పటివరకు హుజరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో ఏ పార్టీ నుంచి.. అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. బిజెపి పార్టీ తరపున ఈటల రాజేందర్ లేదా ఈటెల జమున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీ తరఫున... గెల్లు శ్రీను పేరు వినిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ దళిత సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని తీసుకువచ్చే ప్లాన్ చేస్తోంది. అయితే హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు అధికార టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా లేదా ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా ? అనే సందేహం తెలంగాణ వ్యాప్తంగా ఉంది.

అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కు ప్రజలు పట్టం కడితే అసలు నియోజకవర్గం అభివృద్ధి కాదని కొందరి వాదన. ఎందుకంటే సీఎం కేసీఆర్ మరియు ఈటల రాజేందర్ మధ్య ఉన్న వైరం దీనికి ముఖ్య కారణం. ఈటల రాజేందర్ గెలిస్తే హుజురాబాద్ అభివృద్ధి నిధులు ఆగిపోవడం ఖాయం అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఎన్నికల హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈటల రాజేందర్ ఉనికిని మరింత దెబ్బతీసేందుకు కూడా.... హుజురాబాద్ నియోజకవర్గాన్ని గులాబి బాస్ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: