ఎన్టీఆర్ మొద‌లుకుని వైఎస్సార్ వ‌ర‌కూ తెలుగు వారి అభిమాన నాయ‌కులు. వీరు త‌మ‌దైన శైలిలో రాణించి పేరూ, కీర్తీ గ‌డించా రు. ముందరి త‌రాలు కూడా హాయిగా ఉండేంత సంపాదించి వెళ్లారు. ఇందులో త‌ప్పొప్పుల చ‌ర్చ త‌రువాత వీరు త‌మ స్వ‌శ‌క్తితో రాణించి ప్ర‌జా క్షేత్రంలో మ‌న్న‌న‌లు అందుకున్న మాట వాస్త‌వం. అందుకు త‌గ్గ కృషి అన్న‌ది చిన్న‌ది కాదు. ఇత‌రుల‌కు స్ఫూర్తి ఇ చ్చేంత. ఈ రంగంలోకి రావాల‌నుకునే వారికి ఎన్టీఆర్ ఓ ఆద‌ర్శం అయితే, వైఎస్సార్ ఆ ..ఆద‌ర్శానికి కొన‌సాగింపు.


పార్టీలు వేర‌యినా ఎన్టీఆర్ కానీ వైఎస్సార్ కానీ జ‌నం మ‌ధ్య ఉంటూ జ‌నం కోసం త‌మ‌కు తోచిన రీతిలో పాటుప‌డ్డారు. మ‌ళ్లీ ఇక్క డ వారు చేసిన త‌ప్పుల ప్ర‌స్తావ‌న గురించి చ‌ర్చించ‌డం సంద‌ర్భం కాదు కానీ వారు తెలుగు వారిని ప్ర‌భావితం చేసిన తీరు మాత్రం ప్ర‌శంసించ‌దగ్గ ది. ఎన్టీఆర్ ను కానీ వైఎస్సార్ ను కానీ వారి స్థాయిని  త‌గ్గించ‌లేం అలా అని భార‌త ర‌త్న ఇచ్చి స్థాయిని పెంచ‌లేం. ఆస్తుల త్యాగం వారే కాదు ఎవ్వ‌రూ చేయ‌లేదు కానీ స్వాతంత్ర్యానంత‌రం భార‌తావ‌ని ఏ స్థాయిలోనూ నిస్వార్థ నాయ‌కుల‌ను అం దుకోలేక‌పోయింది. ఉద్య‌మం వ‌ర‌కూ అంతా త‌పించిన వారే కానీ ఉద్య‌మం త‌రువాత ఏర్పాటయిన ప్ర‌భుత్వాలు కాలక్ర‌మంలో అ నేక ఆరోప‌ణ‌ల‌కు కార‌ణం అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కానీ వైఎస్సార్ కానీ భార‌త ర‌త్న‌కు అర్హులా అన్న చర్చ తెర‌పైకి వ‌చ్చింది క‌నుక ఇంకొన్ని మాట్లాడుకోవాలి.


 

అత్యున్న‌త పుర‌స్కారం ఎవ‌రికి ఇవ్వాలి? రాజ‌కీయం చేసిన నాయ‌కులకు ఇవ్వాలి లేదా  దేశానికి సేవ చేసిన లేదా త్యాగం చేసిన వారికి ఇవ్వాలి అన్నది ఒక్క‌టి తేలాలి. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచే నాయ‌కులు, ప్ర‌జాభిమానంతో గెలిచే నాయ‌కులు త‌మ ఆస్తుల‌ను ఏ మయినా ప్ర‌జ‌ల కోసం ధారాద‌త్తం చేస్తున్న సంద‌ర్భాలు ఉన్నాయా? వీరంతా స్వాంతంత్ర్య స‌మ‌ర యోధులు కాదు క‌దా! అలాం ట‌ప్పుడు భార‌త ర‌త్న అన్న అత్యున్న‌త పుర‌స్కారం ఫ‌లానా వారికి ఇవ్వాలి అని ఎలా డిమాండ్ చేస్తారు.?  

 

తెలుగునేలపై ప్రభావితం చేసిన నాయకులు ఎందరో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారి సంక్షేమం కోసం,అభివృద్ధి కోసం పా టుపడిన నాయకులు కాలక్రమంలో ఏ గుర్తింపునకు నోచుకోలేదు. తెలుగునేలపై ఎందరో మ హానుభావులు ఆత్మ త్యాగం చేసిన ఘ టనలు ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పాటుపడిన నిస్వార్థ నాయ కులు ఎందరో ఉన్నారు. వీరందరినీ కాదని ఇప్పుడు ఇం కొందరికి భారతరత్న ఇవ్వాలి అన్న డిమాండ్ ఒక‌టి వస్తుంది. పొట్టి శ్రీరా ములు ఆత్మ త్యాగంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది. పొట్టి శ్రీరాములు భారతరత్న ఇచ్చారా? బ్రిటిషర్ల కాలంలో ఎన్నో త్యాగాలకు ఆనవా లుగా నిలి చిన స్వాతంత్ర సమరయోధులు ఎవరైనా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుంచి భారతరత్నను అందుకున్న ఘటనలు ఉ న్నాయా? ఇవ‌న్నీ లేన‌ప్పుడు లేదా ఇవ‌న్నీ కుద‌ర‌న‌ప్పుడు ఎన్టీఆర్ కు కానీ వైఎస్సార్ కు కానీ భార‌త ర‌త్న డిమాండ్ చేయ‌డం లో అర్థం లేదు. రాజ‌కీయ ఉనికిలో భాగంగా ప్ర‌తి ఏటా జ‌యంతి వేళ‌నో, వ‌ర్ధంతి వేళ‌నో ఇలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం అన్న‌ది ష‌రామా మూలే! కావొచ్చు కానీ నాయ‌కులు కూడా ఓ సారి ఆలోచించి వీటిపై మా ట్లాడ‌డం నేర్చుకుంటే మేలు. అన‌వ‌స‌ర రాద్ధాంతం క‌న్నా అవ‌స‌రం అయిన, కార‌ణానికి తూగిన చ‌ర్చ ప్ర‌భావంతో గొప్ప ప్ర‌తిపాద‌న‌లు రాజ‌కీయ నాయ‌కుల నుంచి పొందే అవ‌కాశం ఉం టుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: