మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లా ? లేనట్లా ? అస‌లు ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఆయ‌న పేరుకు మాత్ర‌మే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారే త‌ప్పా ఆయ‌న టీడీపీని, ఆ పార్టీ పిలుపు ఇస్తోన్న కార్య‌క్ర‌మాల‌ను ఏ మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్ లో గంటా చ‌చ్చీ చెడీ మ‌రి ఎమ్మెల్యే గా స్వ‌ల్ప మెజార్టీ తో గెలిచారు. అయితే రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. దీంతో ఆయ‌న పార్టీని వ‌దిలేశారు.

గంటా కు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎంత ప్ర‌యార్టీ ఇచ్చినా కూడా ఇప్పుడు పార్టీ క‌ష్టాల్లో ఉంటే ఆయ‌న ఏ మాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. దీంతో గంటా శ్రీనివాసరావును ఇప్పుడు చంద్రబాబు దూరం పెట్టార‌నే తెలుస్తోంది. గంటా లెక్క లేని త‌నం బాబుకు ఏ మాత్రం న‌చ్చ‌డం లేద‌ట‌. ఇక గంటా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న త‌న మేళ్లుడిని నియోజ‌క‌వ‌ర్గానికి పార్టీ ఇన్ చార్జ్ గా పెట్టుకున్నారు.

ఇక గంటా ష‌రా మామూలుగానే పార్టీ మార‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో దీనిని గంటా ఖండించ‌రు. ఆయ‌న పై వ‌స్తోన్న సందేహాల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా చేస్తూ ఉంటారు. దీంతో ఆయన టీడీపీలో ఉంటారా ? లేదా ? అన్న దానిపై పార్టీ నేత‌ల‌కు అనేకానేక సందేహాలు వ‌స్తూ ఉంటాయి. ఇటీవ‌ల పార్టీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు చేసిన దాడిని కూడా గంటా ఖండించ లేదు.

చంద్ర‌బాబు దీక్ష చేస్తే ఎమ్మెల్యేగా ఉండి కూడా గంటా పార్టీ కార్యాల‌యానికి రాలేదు. పీఏసీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ పేరు ప్రకటించనంత వరకూ గంటా ఆ పదవి కావాల‌ని కోరారు. అయితే బాబు ఆ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డం తో గంటా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక బాబు గంటాను ఏ మాత్రం ప‌ట్టించు కోకుండా ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేస్తార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: