చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ రెండు ఎన్నికల్లో గెలిచింది. అందులో ఒకటి 1999లో అయితే రెండవది 2014లో. అయితే ఈ రెండు సందర్భాల్లో కూడా చెప్పుకోవాల్సిన అంశాలు వేరే ఉన్నాయి . ఒక విధంగా అనేకా ఇతర అంశాలను కూడా ఇక్కడ ప్రస్థావించుకోవాలి.

 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ ఇంపాక్ట్ బీజేపీ మీద ఉంది. అలాగే వాజ్ పేయ్ ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ఆ సింపతీ కూడా బాగా ఉంది. ఆ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీలో గట్టెక్కగలిగారు అని చెబుతారు. ఇక 2014 ఎన్నికల సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మోడీ ప్రభావం బాగా పనిచేసింది. అంతే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాగా హెల్ప్ చేశారు. మొత్తానికి రెండు ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా అది బాబు విజయ ఖాతాలో పూర్తిగా వేయలేని స్థితి. సరే ఈ రెండు ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్లు ఎన్ని అంటే మెజారిటీ కంటే కొన్ని ఎక్కువ మాత్రమే.

అంటే బంపర్ మెజారిటీ అయితే దక్కలేదు, చిక్కలేదు. ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల్లో 150 సీట్లు గెలిచేస్తామని ఆ పార్టీ ఏపీ విభాగం ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అంటున్నారు. జగన్ గ్రాఫ్ పడిపోయింది అని టీడీపీ గట్టి విశ్వాసం. సరే అలా అనుకున్న ఎంత దారుణంగా పడిపోయినా పాతిక సీట్లు మాత్రమే వైసీపీకి  వస్తాయా అంటే చెప్పలేని సీన్ ఉంది. ఇక టీడీపీకి 150 సీట్లు వస్తాయి అన్న నమ్మకం ఉంటే పొత్తుల కోసం పాకులాట ఎందుకు అన్న ప్రశ్న కూడా ఉంది. మొత్తానికి జగన్ కి 151 సీట్లు వచ్చాయి కాబట్టి తమకూ వస్తాయన్న అంచనాలో అతి ధీమావో కారణం కావచ్చు.

జగన్ 2019 ఎన్నికల్లో ఫ్రెష్ గా సీఎం క్యాండిడేట్ గా ఉన్నారు. పైగా ఆయన ఏదో చేస్తారన్న నమ్మకం నాడు చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు అయితే ఇప్పటికి మూడు సార్లు సీఎం అయ్యారు. ఆయన పాలన సంగతి పూర్తిగా జనాలకు అవగాహన అయి ఉంది. మరి ఇన్ని తెలిసిన తరువాత 150 సీట్లు ఇచ్చేస్తారా అన్నదే డౌట్.  జగన్ ఎంత చెడ్డా వచ్చే ఎన్నికల్లో బిగ్ ఫైటర్. పైగా ఆయనకు సీట్లు తగ్గినా విజయం దక్కుతుంది అన్న లెక్కలు కూడా ఉన్నాయి. ఏపీలో సీన్ ఈ రోజుకు చూసినా వైసీపీ ఓడిపోదనే చెబుతారు. కాబట్టి తమ్ముళ్ళు  కలలు కనడం మానేసి గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తే బాగుంటుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp