
అంతేకాదు చీకటి జీవోల ఉపసంహరణ చేసే వరకూ తాము తగ్గేదే లేదని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణా రెడ్డి అనే ప్రభుత్వ సలహాదారును నిన్నటివేళ నోటికి వచ్చిన విధంగా తిట్టారు. ఆ భాష బాలేదు..ఓ విధంగా కోపంలో మాట్లాడే మాటలు అయినా కూడా ఆ భాష ఆమోదయోగ్యంగా లేదు.అందుకే మాట మిథ్య అని నిర్థారిస్తున్న సందర్భం ఇది. ఎప్పుడు ఏ మాట వస్తుందో ఏ మాట పోతుందో అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం.ఆ రకంగా మాట మిథ్య..ఆట వాస్తవం అవును! సజ్జల చెప్పినా బొత్స చెప్పినా తాము అనుకున్నదే సాధిస్తామని పట్టుబడుతున్నారు.
ఈ నేపథ్యంలోమరో చర్చ కూడా నడుస్తోంది సంఘటిత కార్మికులు అంటే ఉద్యోగులే!కనుక వాళ్లు అనుకున్నవన్నీ సాధించే వరకూ వెనుకంజ వేయరు అని! అవును!ఇదే సందర్భంలో ఆ రోజు సజ్జలతో ఉద్యోగ సంఘాలు ఎందుకు చర్చ జరిపాయి అన్న వాదన కూడా వస్తోంది. సజ్జలపై అంత చిన్న చూపు ఉన్నప్పుడు ఆయననే ఎందుకు మధ్యవర్తిగా ఉండమని అడిగాయి. ఇవాళ ఎందుకని దారి మార్చాయి మాట మార్చాయి ..ఇవి కూడాఉద్యోగుల విషయమై వినిపిస్తున్న ప్రశ్నలే!
వీటన్నింటిపై సజ్జల మాట్లాడడంలేదు.ఎందుకంటే ఆయన సౌమ్యుడు కనుక..ఆయన మాటలు పెద్దగా వివాదాలకు నోచుకోకుండా ఉన్నాయంటే కారణం వ్యక్తిత్వమే!ఈ పాటి వ్యక్తిత్వంను ఉపాధ్యాయులు ఎందుకు కోల్పోతున్నారు.ఎందుకని సజ్జలని తిడుతున్నారు అంటే వీటన్నింటికీ కారణం ఉద్యోగ సంఘాల ప్రతినిధులే! వాళ్లే కనుక ఆ రోజు సవ్యంగా మాట్లాడి వచ్చి ఉంటే ఇన్ని వివాదాలకు ఆస్కారమే లేదన్న భావన ఇవాళ బలీయంగా వినిపిస్తోంది.ఇదే నేపథ్యంలో మరో వాదన కూడా వినిపిస్తుంది జగన్ చెబితేనే తప్ప సజ్జల ఎక్కడా మాట్లాడరు అని అలాంటప్పుడు ఆయనను తిట్టి ఏం లాభం అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమయినా ఒక నాటి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ ఇప్పుడు ప్రభుత్వ పెద్దగా ఎన్నో నిందలు మోస్తున్నారు.ఆటకు,ఆటవిడుపునకు,పట్టు విడుపునకు విరామం ఎప్పుడో? ఈ తరుణంలో నిజం సజ్జలది నింద ఉద్యోగులది! అని నిర్థారించక తప్పదు.