రాష్ట్రంలో ఏ పార్టీ లీడ్‌లో ఉంటే..అదే పార్టీ ఏలూరులో కూడా లీడ్‌లో ఉంటుంది...అంటే ఏలూరు అసెంబ్లీలో గెలిచే పార్టీ..ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది...గత కొన్ని ఎన్నికల నుంచి ఏలూరులో ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తుంది..అందుకే ఏలూరు సీటులో గెలుపు కోసం పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. అయితే గత ఎన్నికల్లో ఏలూరులో వైసీపీ గెలిచిన విషయం తెలిసిందే...అలాగే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఇక ఈ సారి మాత్రం ఏలూరు సీటుని దక్కించుకోవాలని టీడీపీ చూస్తుంది...అటు మంత్రి ఆళ్ళ నాని సైతం..మళ్ళీ గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. కాకపోతే ఆళ్ళ గెలుపు అనేది కేవలం జనసేన పార్టీ మీద ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఆ పార్టీ విడిగా పోటీ చేస్తే ఆళ్ళకు గెలిచే ఛాన్స్ ఉంది...లేదంటే ఏలూరులో టీడీపీకి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకసారి ఆళ్ళ నాని గెలుపోటములకు సంబంధించిన రాజకీయ సమీకరణాలని ఒక్కసారి పరిశీలిస్తే...ఏలూరులో వైసీపీ, టీడీపీలు బలమైన పార్టీలు.

ఒకప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్, టీడీపీల మధ్య ఫైట్ నడిచేది...కానీ 2014 నుంచి వైసీపీ, టీడీపీల మధ్య ఫైట్ నడుస్తోంది..2014లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. అప్పుడు పవన్ కల్యాణ్..టీడీపీకి సపోర్ట్ చేయడంతో దాదాపు 24 వేల ఓట్ల మెజారిటీతో బడేటి బుజ్జి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది..జనసేన సెపరేట్‌గా పోటీ చేయడం టీడీపీకి మైనస్ అయింది..వైసీపీకి ప్లస్ అయింది. వైసీపీ నుంచి బరిలో దిగి ఆళ్ళ నాని...4 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలిచారు..అదే సమయంలో ఇక్కడ జనసేనకు 16 వేల ఓట్లు వరకు పడ్డాయి..అదే అప్పుడే టీడీపీతో జనసేన కలిస్తే ఆళ్ళ పరిస్తితి ఏమయ్యేదో ఊహించుకోవచ్చు.

నెక్స్ట్ కూడా జనసేనపైనే ఆళ్ళ గెలుపు ఆధారపడి ఉంది. ఒకవేళ టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటే...ఏలూరు అసెంబ్లీ సీటు టీడీపీకే దక్కుతుంది...అలాగే విజయం కూడా సాధించే ఛాన్స్ ఉంది. అలా కాకుండా విడిగా పోటీ చేస్తే ఆళ్ళ నాని సేఫ్ అవుతారు. మరి చూడాలి ఈ సారి ఏలూరులో ఎలాంటి ఫలితం వస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: