
సరే మంత్రి పదవి ఎలాగో జగన్ చేతుల్లో ఉంది..అయితే ఎమ్మెల్యే పదవి నిలబెట్టుకోవడం అనేది పేర్ని చేతుల్లో ఉంది...మరోసారి ఆయన గెలిస్తేనే ఎమ్మెల్యే పదవి నిలబడుతుంది...లేదంటే ఈ సారి ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా ఉంది. ఎందుకంటే మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్నికి పెద్దగా అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు..ఏదో మంత్రిగా ఉండటం, అధికార బలం వల్ల పేర్ని బలంగా కనిపిస్తున్నారు గాని, క్షేత్ర స్థాయిలో చూస్తే మాత్రం పేర్నికి బలం తగ్గినట్లే కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది.
పేర్ని పనితీరుని మెచ్చుకునే వారు కనిపించడం లేదు...గతంలో ఆయన బాగా పనిచేశారు గాని, ఇప్పుడు అలా చేయడం లేదని చెప్పుకుంటున్నారు...ఇక దీనికి తోడు పవన్‌తో కయ్యం వల్ల నియోజకవర్గంలో కాపు ఓటింగ్ పేర్నికి దూరం అయింది.
ఇదే సమయంలో ఇక్కడ ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దూకుడుగా పనిచేస్తున్నారు..ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి తన బలాన్ని పెంచుకునే దిశగానే పనిచేస్తున్నారు...పైగా ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే, ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు...ఏదొక యాత్ర పేరుతో ఊరూరు తిరిగేస్తున్నారు. ఈ పరిస్తితిని చూస్తుంటే నెక్స్ట్ ఎన్నికల్లో పేర్నికి కొల్లు చెక్ పెట్టేలా ఉన్నారు.