రాజకీయపార్టీలన్నాక రాజకీయాలే చేస్తాయి. పొరబాటున కూడా ప్రజాహితం ఉండదు. నేతిబీరకాయలలో నెయ్యి ఎంతుంటుందో రాజకీయాల్లో ప్రజాహితం కూడా అంతే ఉంటుంది. కాకపోతే పైకి ప్రజాసేవ చేస్తున్నట్లు కనబడినా లోలోపల మాత్రం అజెండా వేరే వుంటుంది. ఇపుడు రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ చేస్తున్నది ఇదే. పేరుకు అన్నక్యాంటిన్ల ద్వారా పేదలకు భోజనం పెట్టడం. కానీ లోలోపల అజెండా ఏమిటంటే అన్నక్యాంటిన్ల ముసుగులో వైసీపీని గబ్బుపట్టించటం.





విషయం ఏమిటంటే పేదలకు భోజనం పెడుతున్న ముసుగులో వైసీపీని టీడీపీ రెచ్చగొడుతోంది. ఒకవేళ అధికారపార్టీ నేతలు పట్టించుకోకపోతే రోడ్ల కూడళ్ళల్లో ట్రాఫిక్కుకు ఇబ్బందులు కలిగేట్లుగా అన్నక్యాంటిన్ల పేరుతో ఒక శిబిరం ఏర్పాటుచేసి హడావుడి చేస్తోంది. దాంతో అధికారపార్టీనేతలు కాకపోయినా అధికారయంత్రంగాం జోక్యం చేసుకుంటోంది. దాంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు దాన్ని పెద్ద ఇష్యూచేసి రచ్చరచ్చ చేస్తున్నారు. దీనివల్ల జనాల్లో ఏమి సిగ్నల్ వెళుతోందంటే టీడీపీ భోజనాలు పెడదామని ప్రయత్నిస్తుంటే వైసీపీ అడ్డుకుంటోందని.





కుప్పం, నరసరావుపేట, తెనాలి లాంటి ప్రాంతాల్లో జరిగిన రాజకీయం ఇదే. మూడుచోట్లా గొడవలైన తర్వాత వైసీపీ నేతలకు బుద్ధి వచ్చినట్లుంది. అదేమిటంటే అన్నక్యాంటిన్లను టీడీపీ నిర్వహిస్తే తాము అడ్డుకోకూడదని. అందుకనే తిరుపతిలో మొదలైన అన్నక్యాంటిన్ను వైసీపీ నేతలెవరు పట్టించుకోలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే అధికారంలో ఉన్నపుడే టీడీపీ అన్నక్యాంటిన్లను నిర్వహించలేకపోయింది. ప్రభుత్వ ఖర్చుతోనే అన్నక్యాంటిన్లను నడపలేకపోయిన టీడీపీ ఇపుడు సొంతఖర్చుతో నడుపుతుందా ? ఈ బుద్ధి వైసీపీకి మొదట్లో లేకపోయింది.





ఇందుకనే టీడీపీ చేస్తున్న రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యిందట. ఇకనుండి టీడీపీ ఎక్కడ అన్నక్యాంటిన్ను ఏర్పాటుచేసినా పట్టించుకోకూడదని నిర్ణయించుకుందట. అందుకనే తిరుపతిలో అన్నక్యాంటిన్ ఏర్పాటుచేసినా ఎవరు పట్టించుకోలేదు. ఇదే సమయంలో అన్నక్యాంటిన్ కు కూడా పెద్దగా స్పందనలేదట. సొంత ఖర్చులతో మహాఅయితే ఎక్కడ ప్రారంభించినా టీడీపీ అన్నక్యాంటిన్లను నాలుగురోజులు  కూడా నడపలేందు. ఈమాత్రం దానికి వైసీపీ ఎందుకు ఉలిక్కిపడిందో అర్ధంకావటంలేదు. మొత్తానికి ఇప్పటికైనా వైసీపీకి బుద్ది వచ్చినందుకు సంతోషించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: