ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండుతో పాదయాత్ర చేస్తున్న జేఏసీ నేతలకు హైకోర్టు పెద్ద షాకిచ్చింది. పాదయాత్రచేస్తున్న జేఏసీ నేతలను తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం దగ్గర పోలీసులు నిలిపేసి గుర్తింపుకార్డులను తనిఖీచేశారు. దాంతో పాదయాత్రలో పాల్గొంటున్న వేలాదిమందిలో 99శాతం మంది జంపైపోయారు. ఎందుకంటే వాళ్ళదగ్గర గుర్తింపుకార్డులులేవు. గుర్తింపుకార్డులు ఎందుకు లేవంటే వాళ్ళెవరు అమరావతి ప్రాంతంవాళ్ళు కాదుకాబట్టే. 





పాదయాత్రకు పోలీసులు అభ్యంతరం చెప్పినపుడు జేఏసీ కోర్టుకెళ్ళి అనుమతి సాధించుకుంది. పాదయాత్రకు అనుమతించేటపుడు తప్పనిసరిగా గుర్తింపుకార్డులుండాలని చెప్పటంతో పాటు మరికొన్ని షరతులు కూడా కోర్టు విధించింది. సో కోర్టు చెప్పినట్లే గుర్తింపుకార్డులను పోలీసులు తనిఖీలు చేస్తే అందులో చాలామందికి కార్డులు లేవని బయటపడింది. పోలీసులు ఎక్కడ అదుపులోకి తీసుకుంటారో అనే భయంతో పాదయాత్ర నుండి అందరు పారిపోయారు.





దాంతో చేసేదిలేక జేఏసీ పాదయాత్రను వాయిదా వేసుకుంది. వెంటనే కోర్టులో పిటీషన్ వేసింది. సింగిల్ బెంచ్ విదించిన షరుతలను ఎత్తేయాలని కోరుతు జేఏసీ వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఆదేశించినట్లుగా షరతులన్నింటినీ జేఏసీ ఫాలో కావాల్సిందే అని స్పష్టంగా చెప్పింది. పైగా షరతులను ఉల్లంఘిస్తున్నట్లు రుజువైతే వెంటనే పాదయాత్రపై యాక్షన్ కూడా తీసుకోవచ్చని డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో జేఏసీకి ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు. ఇంతకాలం పాదయాత్రలో పాల్గొంటున్న వాళ్ళంతా అమరావతి ప్రాంతంలోని రైతులే అంటు అబద్ధాలు చెప్పి నెట్టుకొచ్చేసింది.





ఎప్పుడైతే పోలీసులు గుర్తింపుకార్డుల తనిఖీ అన్నారో వెంటనే మాయమైపోయారు. నిజంగానే పాదయాత్రలోని వాళ్ళంతా అమరావతి ప్రాంతంవాళ్ళే అయితే మాయమైపోవాల్సిన అవసరంలేదు. వైసీపీ వాళ్ళు మొదటినుండి ఆరోపిస్తున్నట్లే చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు,  భూములు కొన్న బినామీలు, బినామీల తరపు వాళ్ళతో పాటు టీడీపీ కార్యకర్తలే ఉన్నారు. వీళ్ళెవరికీ అమరావతి ప్రాంతంలో ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏమీ లేవుకాబట్టి తప్పించుకుని పారిపోయారు. మరిపుడు జేఏసీ ఏమిచేస్తుందో చూడాలి. ఎందుకంటే గుర్తింపుకార్డులున్న వాళ్ళల్లో చాలామంది పాదయాత్రకు ఆసక్తి చూపటంలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: