ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత రెండు వారాల నుండి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. గత నెల రోజుల క్రితం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను తెలిసో తెలియకో మీడియా ముందు ప్రభుత్వం మరియు జగన్ పై చేసిన విమర్శల కారణంగా సీఎం ఆఫీస్ కు వెళ్లడం జరిగింది. ఈ మీటింగ్ లో జగన్ శ్రీధర్ రెడ్డి తో ఏమి మాట్లాడాడో తెలియదు. కానీ అప్పటి నుండి శ్రీధర్ రెడ్డి వ్యవహారం కాస్త తేడాగా అనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గత వారంలో శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడుతున్నాడన్న వార్తలు వచ్చాయి.. కానీ ఎవ్వరూ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తీరా రెండు రోజుల క్రితం నెల్లూరు పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించి నేను వైసీపీని వీడుతున్నాను అంటూ షాక్ ఇచ్చాడు.

అంతే కాకుండా చంద్రబాబు నాయుడు ఇప్పుకుని అవకాశం ఇస్తే నెల్లూరు రురల్ నుండి టీడీపీ ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. దీనిపై ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నిన్న విడుదల అయిన శ్రీధర్ రెడ్డి వీడియో ఒకటి మరికొన్ని విషయాలను రాష్ట్ర ప్రజలకు తెలుపుతోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో ను నిన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ప్రోగ్రాం ఆదివారం రాత్రి ప్రసారం కానుంది.

ఈ వీడియోలో ఇద్దరూ చాలా సరదాగా ముచ్చటించారు. కాగా కోటంరెడ్డిని టీడీపీలో చేర్చడానికి సాయం కావాలని రాధాకృష్ణను అడగడం కొసమెరుపు అని చెప్పాలి. మరి ఈ వ్యవహారం ముందు నుండే తెరవెనుక జరుగుతూ ఉన్నట్లు ఈ వీడియోను బట్టి తెలుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. టీడీపీ సక్సెస్ లో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఎంత కీలకం అన్నది అందరికీ తెలిసిందే. మరి 2024 ఎన్నికల్లో చంద్రబాబును మళ్ళీ సీఎం ను చేయడానికి గట్టిగానే కృషి చేస్తున్నట్లు ఉన్నారని వార్తలు వినబడుతున్నాయి. కాగా ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రాధాకృష్ణ టీడీపీ నుండి టికెట్ ఇప్పిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: