కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు అధిష్టానం ముందున్న సవాలు ఎవరు ముఖ్యమంత్రి అనేది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డి.కె శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మధ్య సీఎం సీటు కోసం తెగ పోటీ నడుస్తోంది. కర్ణాటక ప్రజల మద్దతు ఎక్కువగా సిద్ద రామయ్యకే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 42 శాతం మందికి పైగా సిద్ధ రామయ్య ముఖ్యమంత్రి అయితే బాగుండు అని కోరుకుంటున్నట్లు ఒక సర్వే లో తేలింది.


డి.కె శివకుమార్ ను దాదాపు 5 శాతంలోపే ప్రజలు సీఎం గా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ గెలవకపోయిన ముఖ్యమంత్రి ఎవరనే నిర్వహించిన సర్వేలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 28 శాతం, మరో మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్ప కు 34 శాతం మంది మద్దతు పలికారు. ముఖ్యమంత్రిగా పదవిపై ఇప్పుడు తర్జన భర్జనలు పడుతున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు సంబంధించి ఎక్కువగా ఫండ్స్ పంపించేది డి.కె శివకుమార్. ఈయనకు అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది.



కానీ సిద్ధ రామయ్యకు మాత్రం ప్రజల్లో మంచి పేరుంది. ఇలాంటి సమయంలో వచ్చిన అవకాశాన్ని పొగోట్టుకోవద్దన ఆలోచనలో డి.కె శివకుమార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ముఖ్యమంత్రి పదవి త్యాగం చేశాననే చెప్పుకొస్తున్నారు. సిద్ధ రామయ్యను కాదని శివకుమార్ కు ఇస్తే ఏం జరుగుతుందనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఫ్రీ ఫోల్ సర్వేల్లో డి.కె శివకుమార్ కు మద్దతు రాలేదు.



ప్రస్తుతం కర్ణాటకకు చెందిన వారి పేర్ల మీద ఇప్పుడు హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లలో చాలా రూమ్స్ బుక్ అవుతున్నట్లు తెలుస్తోంది. శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజ్ కృష్ణ, పార్క్ హయత్, నోవాటెల్ లో 20 వరకు రూమ్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన వారే ఈ హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: