టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  వచ్చే ఎన్నికలకు సంబంధించిన పార్టీ మేనిఫెస్టో ను ఇటీవల మహానాడు సభలో  విడుదల చేశారు. అందులో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. మహానాడు సమావేశంలో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సీఎం జగన్ ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు పాలన చేతకావడం లేదని వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ఏమేం అభివృద్ధి పనులు చేస్తారో చెప్పారు. ఇంటికి ఒక్కరికి అమ్మఒడి సాయం వైసీపీ ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు ఇద్దరికి ఇస్తానని ప్రకటించారు.


గతంలో జగన్ పాదయాత్ర సమయంలో 45  ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళకు పెన్షన్ ఇస్తానని ప్రకటించారు. దీనిపై చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. సీఎం జగన్ దాన్ని మార్చుకుని చేయూత పేరుతో ఏడాదికి రూ.18 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ విధంగానే కొనసాగిస్తున్నారు.  ఇప్పుడు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. దీంతో మహిళల్లో అభిమానం పెరిగి టీడీపీకి ఓటేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలకు దీటుగా జగన్ ఎలాంటి హామీలు ఇస్తాడోనని అందరూ వేచి చూస్తున్నారు.


వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే నవరత్నాలు ఇస్తామని ప్రకటించారు. దీంతో ప్రజల్లో పాజిటివిటీ వచ్చింది. మహిళలు, అన్ని వర్గాల వారు నవరత్నాలకు ఆకర్షితులై భారీ మెజార్టీతో జగన్ ను గెలిపించారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు  అభ్యర్థులకు కలిసొచ్చింది.  ముఖ్యంగా బస్సుల్లో మహిళలకు ఫ్రీ టికెట్లు, మహిళలకు పెన్షన్ పథకం గెలుపు తీరాలకు చేర్చింది.  చంద్రబాబు కూడా మహిళల ఓట్లే ప్రాధాన్యంగా మేనిఫెస్టో ప్రకటించారు. రాబోయే కాలంలో జగన్ ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది.  2024 లో వైసీపీ గెలవాలంటే ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: