ఏపీలో అక్రమ మద్యం రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. విస్సన్నపేట పోలవరం వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. శరీరానికి మద్యం బాటిళ్లు చుట్టుకుని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మద్యం సీసాలు శరీరానికి ప్లాస్టర్తో అతికించుకుని చొక్కా ధరించి ద్విచక్రవాహనంపై దర్జాగా రవాణా చేస్తున్నారు. పోలీసులు తనిఖీల్లో 101 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.