ఎన్డీఏ రెండో దఫా పాలనపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నవేళ, 2024నాటికి దేశంలో అధికార మార్పిడి తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మోదీ టీమ్ పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శల డోసు పెంచింది. అమూల్ బేబీ అంటూ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీపై జరుగుతున్న ప్రచారమంతా ఈ వ్యూహంలో భాగమే. అయితే ఇప్పుడు రాహుల్ టీమ్ కూడా అలర్ట్ అయింది. రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఈ హడావిడి ఎక్కువైంది. రాహుల్ క్వాలిఫికేషన్లను హైలెట్ చేస్తూ.. పరోక్షంగా మోదీని ఎద్దేవా చేస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.