అప్పుడు దివంగత వైఎస్సార్కైనా, ఇప్పుడు ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డికైనా ప్రత్యర్ధి చంద్రబాబే. గతంలో వైఎస్, చంద్రబాబులు పోటాపోటిగా రాజకీయాలు చేసేవారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి అదిరిపోయే వ్యూహాలు వేస్తూ ముందుకెళ్ళేవారు. ఒకసారి చంద్రబాబు పైచేయి సాధిస్తే, మరొకసారి వైఎస్ పైచేయి సాధించేవారు. ఇలా వారి మధ్య రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు జగన్, చంద్రబాబులు మధ్య కూడా అలాగే రాజకీయం నడుస్తోంది.