తమ పెళ్లి ఆనందాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవాలని నిర్ణయం తీసుకుంది ఈ జంట. అందులో భాగంగా ఇండియాలో అన్ని రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలను ఎంచుకొని మరి అక్కడ తమ తరఫున మిఠాయిలు పంచడమే కాకుండా పలు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారు. మా పెళ్ళికి మీరు చూపించిన ప్రేమాభిమానాలకు మా చిన్న కృతజ్ఞత అంటూ రష్మిక తమ ఇద్దరి తరఫున సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది.
మార్చి ఒకటవ తేదీన ఈ గిఫ్ట్ పంపిణీ భోజన ఏర్పాట్లు కూడా జరుగుతాయని తెలియజేశారు. స్టార్ సెలబ్రిటీ జంట తమ వివాహం సందర్భంగా ఇలా సామాన్య ప్రజల ఆకలి తీర్చే కార్యక్రమం చేపట్టడంతో అభిమానులే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీలు, నెటిజెన్స్ సైతం ఈ జంటపైన ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి నటిస్తున్న రణబలి సినిమాకి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడంతో బాగా ఆకట్టుకుంది. రణబలి సినిమాతో ఈసారి ఎలాగైనా ఈ జంట సక్సెస్ కొట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇవే కాకుండా రష్మిక చేతిలో మరో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ కూడా రౌడీ జనార్ధన్ అనే సినిమాలో నటిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి