రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. ఒకదానితో మరొకటి పోల్చి చూసుకుంటున్నాయి. ప్రజలు కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన వారు కావడంతో పక్కనున్న తెలుగు రాష్ట్రంతో తమ రాష్ట్రాన్ని పోల్చి చూసుకుంటున్నారు. తెలుగు ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు మధ్య కూడా పోలిక పెడుతున్నారు. 



ఈ నేపథ్యంలో చంద్రబాబు దేశంలో తామే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నామని పదే పదే అనేక ప్రెస్ మీట్లలో చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రెండు రాష్ట్రాలూ సమానంగా వచ్చి మొదటి స్థానాన్ని పంచుకున్నాయి. కానీ ఇప్పుడు కేంద్రం  విడుదల చేసిన గణాంకాలు రెండింటిలో ఏది ఎక్కువగా అభివృద్ధి చెందుతోందో చెప్పేశాయి. 



ఆదాయ అభివృద్ధిలో తెలంగాణ స్టేట్ దేశంలోనే నెంబర్ వన్ అన్న సంగతి కాగ్ వెల్లడించిన గణాంకాల్లో తెలిసింది. ఈ రాష్ట్రం వృద్ధి రేటు 17.8 శాతంగా ఉందట. అదే ఆంధ్రప్రదేశ్ 7లేదా 8 శాతం ఆదాయ అభివృద్ధిలో ఉందట. ప్రధానంగా తెలంగాణ పన్ను ఆదాయం దాదాపు 18 శాతంగా పెరిగింది. 



ఆదాయాభివృద్ధిలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ కొట్టేయడంతో కేసీఆర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గవర్నర్ ను కలసి ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆయన కూడా కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఇదే జోరు కొనసాగించాలని ఆశీర్వదించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: