వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు.. ఆయన ముందుగా జెరూసలేం వెళ్ళి.. ఆ తర్వాత అమెరికా వెళ్లారన్నది ముందుగా ఉన్న సమాచారం.. అయితే ఆయన విదేశీ పర్యటన దేశాల జాబితాలో ఇజ్రాయిల్ కూడా ఉంది.
ఇజ్రాయిల్.. నీటి వనరులు అంతగా లేని దేశం.. కానీ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న నీటి కొరతకు ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానం సమాధానంగా నిలుస్తోంది.
అంతే కాదు.. నీటి కొరతకు ఓ చక్కటి పరిష్కారం కనుగొంది. సముద్రం నీటిని శుద్ది చేసి మంచినీటిగా మార్చే సాంకేతికతను విరివిగా వాడుతోంది. ఏపీ సీఎం జగన్ తన ఇజ్రాయిల్ పర్యటనలో ఇలాంటి ప్లాంటును సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా అక్కడ సాగుతున్న వివిద అభివృద్ది, నీటి సంరక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. జగన్ అక్కడి వ్యవసాయ క్షేత్రాలను కూడా పరిశీలించారు.
ఉప్పునీటిని శుద్ది చేసే ప్రక్రియను జగన్ అడిగి తెలుసుకున్నారు. అక్కడి అదికారులు ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే మెకానిజం మరియు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, వ్యయంపై జగన్ కు పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. ప్రాజెక్టుకు ఏర్పాటుకు పెట్టిన ఖర్చు, కార్యాచరణ ఖర్చుల గురించి వివరించారు. ఆ కేంద్రంలో శుద్ది చేసిన నీటిని ముఖ్యమంత్రి సహా అధికారులు రుచి చూశారు. నాణ్యత బావుండటంతో వారిని అభినందించారు.
ఇజ్రాయిల్ దేశ సాంకేతితక ఏపీకి బాగానే పనికొస్తుంది. ఏపీకి దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. తీరం పొడవునా మంచినీటికి ఇబ్బందులూ ఉన్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో సముద్రం నీటిని మంచినీరుగా మార్చగలిగితే.. తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. తక్కువ ఖర్చుతో ఇలాంటి టెక్నాలజీని వాడుకుంటే.. రాష్ట్రానికి తీరప్రాంతంలో తాగునీటికి కొరత ఉండదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి