ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీలో జిల్లాల విభజనకు హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రా ప్రభుత్వం. అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగాలి, అదే విధంగా ప్రజాసమస్యలు తీరాలి. ఎలా అన్న దానికి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని ఆలోచిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులేస్తున్న తరుణంలో సర్కారుకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. పరిపాలనా పరంగా సౌలభ్యముండాలి, అదే సమయంలో ఆ పరిపాలన ఫలాలు ప్రజలకు అందాలి. తెలంగాణ ప్రభుత్వం ఫాలో అవుతున్న ఈ ఫార్ములా ఆధారంగానే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కూడా అడుగులు వేస్తోంది.


ఎన్నికల తరువాత గెలిచి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ దిశగా కసరత్తు చేస్తున్న జగన్ సర్కార్ పదమూడు జిల్లాలను ఇరవై ఏడు జిల్లాలుగా మార్చాలని అనుకుంటోంది. ఇందు కోసం రెవెన్యూ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గాన్ని జిల్లాలుగా మార్చాలనేది ఓ ప్రతిపాదన. దీనిపై సాధ్యాసాధ్యాలమీద అధికారులు కసరత్తు చేస్తున్నారు. కానీ విస్తృత పరిధి కలిగిన కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా గుర్తించడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో లోక్ సభ స్థానాలను జిల్లాలుగా విభజించడం సాధ్యం కాదన్న కథనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్.


ఎందుకంటే కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు వేర్వేరు జిల్లాల్లో కలిసున్నాయి. అంతేకాదు విద్య, ఉపాధి, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న స్థానాలు ఓ చోట ఉంటే, మరో చోట ఏవీ లేకపోవటం ఈ వ్యతిరేకతకు కారణం అవుతుంది. ఆర్థికంగా పరిపుష్టి గల కొన్ని పారిశ్రామిక సంస్థలు అదే విధంగా కొన్ని విద్యా సంస్థలు, అన్నీ కూడా అలాగే పైడిభీమవరంలో ఉండే ఇండిస్టియల్ ఏరియా ఇవన్నీ కూడా వెళ్లిపోడానికి అవకాశముంది. విభజన జరిగిన తరువాత ఈ ఏడు నియోజకవర్గాలు దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళం జిల్లా కొత్తగా అవతరించేటప్పుడు దీన్ని తాలూకా అభివృద్ధి మీదుగా ఆ విభజన అనంతరం దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం మాత్రం తప్పని సరిగా ఉంది.


అలా అయితే పరిశ్రమలున్న చోట ఆర్థిక పరిపుష్టి ఏం లేని చోట రెవిన్యూ లోటు ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పదమూడు జిల్లాలుగా ఉన్న ఏపీ భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తున్న అధికారులు భూవిస్తీర్ణం, జనాభా, గ్రామాలూ, మండలాలు, రెవెన్యూ డివిజన్ ల వివరాల ప్రాతిపదికన నివేదికలు తయారు చేసే పనిలో పడ్డారు. పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలో జిల్లాల సంఖ్య నాలుగు వందల పధ్ధెనిమిది ఉంటే ఇప్పుడా సంఖ్య ఏడు వందల ఇరవై ఐదుకు పెరిగింది. రాష్ట్రాల విభజన మాదిరిగానే జిల్లాల విభజనకు ఎలాంటి ప్రామాణిక సూత్రం లేదు. శాస్త్రబద్ధమైన విధానం కానీ ఓ ప్రాతిపదికన కానీ రాజ్యాంగంలో నిర్ణయించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: