ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భం గా టీడీపీ సోషల్ మీడియా జగన్ ను తుగ్లక్ గా చూపుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. మరి జగన్ ను తుగ్లక్ అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వంద రోజుల్లో ఏం చేశారు.. ఓ సారి పరిశీలిద్దాం..


ఈ వంద రోజుల్లో చంద్రబాబునాయుడు యాభై రోజులు ఆయన ఎందుకు ఓడిపోయాడో కనుక్కునే పనిలోనే సమయం వృథా చేసారు. ఆ యాభై రోజుల విశ్లేషణల్లో ఆయన ఫైనల్ గా ఏం చెప్పారంటే.. సామాజిక సమీకరణాల వల్లే ఓడిపోయాను అన్నారు. పోనీ మిగిలిన 50 రోజుల్లోనైనా ఏమైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించారా అంటే అదీ లేదు.


అసెంబ్లీలో పొంతన లేని ప్రశ్నలు అడగడం.. యాగీ చేయడం తప్ప నిర్మాణాత్మకంగా వ్యవహరించనేలేదు. మరికొంత కాలం కరకట్టపైనున్న అద్దె ఇంటిని కాపాడేందుకే వెచ్చించారు. కృష్ణావరదల సమయంలో తన ఇంటిని ముంచేందుకు జగన్ కుట్రపన్నారని.. ప్రకాశం బ్యారేజీకి అడ్డంగా పడవలు పెట్టారని దుష్ప్రచారం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో బురద రాజకీయం చేసి దొరికిపోయారు.


బీజేపీతో వైసీపీకి ఇబ్బందులు కలగాలని మతపరమైన దుష్ప్రచారానికి కూడా తెలుగుదేశం వెనకాడటం లేదని చెప్పొచ్చు. తిరుమలలో చర్చి ఉందనే మరో ప్రచారాన్ని టీడీపీ సోషల్ మీడియా తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత అదీ ఉత్తదే అని తేలింది.


ఇక తాజాగా జగన్ సర్కారు నాణ్యమైన బియ్యం పథకం ప్రవేశపెడితే ఎక్కడ జగన్ కు మంచి పేరు వస్తుందో అని.. బియ్యం చెక్కలు ఇస్తున్నారని.. ముక్క బియ్యం ఇస్తున్నారని మరో దుష్ప్రచారానికి తెర తీశారు. మొత్తంగా చంద్రబాబు ఈ 100 రోజుల ప్రతిపక్ష పాత్రలో చేసిన ఘన కార్యాలు ఇవీ. మరి ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: