దిశ రేపిస్టులను ఉరి తీయాలని దేశమంతా నినదిస్తోంది. ఉరి కాదు.. నడి రోడ్డులో కాల్చేయాలని మరికొందరు అంటున్నారు. ఎన్ కౌంటర్ చేసి పారేయాలని ఇంకొందరు చెబుతున్నారు. కానీ వీటిలో ఏది అమలు చేయాలన్నా నేరం రుజువు కావాలి. అందుకు కొన్ని కీలక సాక్ష్యాలు కావాలి. అవేంటో ఓసారి చూద్దాం..

 

దిశ రేపిస్టులు అంత అమాయకులేం కాదు.. ఫుల్లుగా తాగి ఉన్నా కూడా వాళ్ల బ్రెయిన్ బాగానే పని చేసింది. అందుకే.. ఆధారాలు దొరక్కుండా ఉండే ఉద్దేశంతో మృతదేహాన్ని దగ్గర ఉండి మరీ దహనం చేశారు. అందువల్ల సైంటిఫిక్ ఆధారాలు సేకరించడం పోలీసులకు కష్టతరమైంది. దిశ అదృశ్యమైన మర్నాడు ఉదయమే షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద కాలిపోతున్న మృతదేహాన్ని చూసి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

అలా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద దొరికిన లాకెట్‌ ఆధారంగా ఆమె దిశ అని గుర్తించగలిగారు. ఆ తర్వాత 24 గంటల్లోనే నిందితులను పట్టుకోగలిగారు. క్లూస్‌ బృందం మృతదేహం వద్ద కాలిన దుప్పటి ముక్కలు, ప్యాంట్‌ జిప్‌, బెల్టు బకిల్‌ వంటి ఆధారాలు తీసుకున్నారు. అంతే కాదు.. అత్యాచారం జరిగిన ప్రాంతంలోనూ ఆధారాల కోసం అన్వేషణ సాగింది.

 

తొండుపల్లి టోల్‌గేటు సమీపంలో ఉన్న గోడ పక్కన ఆమెపై అత్యాచారం జరిపి ప్రాంతంలో తనిఖీ చేయగా.. దిశ లోదుస్తులు, ఐడీ కార్డు, చెప్పులు దొరికాయి. ఇప్పుడు వీటిని ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్లూస్‌ బృందం సేకరించిన ఆధారాల్లో గానీ.. అత్యాచారం జరిపి ప్రాంతంలో దొరికిన వస్తువులపై గానీ రేపిస్టుల డీఎన్‌ఏ నమూనాలు దొరికితే వారికి శిక్షపడటం సులువు అవుతుంది. దిశ మొబైల్ ఫోన్ కూడా ఈ కేసులో మరో కీలక ఆధారం అవుతుందంి. దాని ద్వారా మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ కేసును సైంటిఫిక్ గా నిరూపించడం కత్తిమీద సామే.

మరింత సమాచారం తెలుసుకోండి: