దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఉల్లి దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో పాటు మార్కెట్లో ఉల్లి డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇక ఉలిక్కి డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో.. ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ఏకంగా వందరూపాయల నుంచి 200 రూపాయల వరకు ధరలు  పలుకుతున్నాయి. ఇక ఉల్లి ధరలు సామాన్య ప్రజలను  బెంబేలెత్తిపోతున్నారు. కాస్తో కూస్తో రేట్లు పెరిగితేనే సామాన్య ప్రజలు కూరగాయలను కొనలేని పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు ఉల్లి ధరలు ఏకంగా 100 నుంచి 200 మధ్యలో పలుకుతున్న డంతో సామాన్య ప్రజలకు ఉల్లి భారంగానే మారిపోయింది. దీంతో ఉల్లి ధర చూసి చాలామంది జనాలు జంకుతున్నారు. ఇక ఉల్లి ధర భారీగా పెరిగి కోయకుండానే  ప్రజల కళ్ళలోంచి నీళ్ళు తెప్పిస్తోంది. 

 

 

 

 అయితే దేశంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపింది. ఉల్లి ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయని ఉల్లి ధరలను నియంత్రించాలని కరీంనగర్లోని కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. మెడలో ఉల్లిగడ్డలు వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు... ఉల్లి ధర భారీగా పెరిగి పోయిందని... ఉల్లి ధరలను నియంత్రించి  తక్కువ రేట్ కి ప్రభుత్వం ప్రజలకు ఉల్లిని  అందించాలని డిమాండ్ చేశారు. అయితే ఉల్లి ధరను  తగ్గించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. 

 

 

 

రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో బియ్యం మాదిరిగానే సబ్సిడీ కింద ఉల్లిగడ్డలను కూడా విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కిలో కోడికి కిలో ఉల్లి పాయలు మాత్రమే  వస్తున్నాయని... ఆయన ధర వ్యత్యాసం అని తెలియజేశారు. ఈ సందర్భంగా కిలో కోడి ఇచ్చే కిలో ఉల్లిపాయలను కొన్నారు . అనంతరం ఉల్లి ధరలను నియంత్రించాలని కోరుతూ తహసిల్దార్ నారాయణ కు వినతిపత్రం అందించారు ఆయన. ఇదిలా ఉండగా అటు  దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉల్లి ధరలను సబ్సిడీ కింద పలు ప్రభుత్వాలు అందచేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: