కొన్ని రోజులుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్  అధికార శివసేనకు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి భార్య అమృత  ఉద్ధవ్ థాకరే పై విమర్శలు చేయడంతో....యాక్సిస్ బ్యాంకు చెల్లిస్తున్న  మున్సిపల్  సంస్థ ఉద్యోగుల జీతాలను  వేరే జాతీయ బ్యాంకు కు బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ లో  అమృత సీనియర్ అధికారి గా ఉండడంవల్లే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని  అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత  శివసేన పార్టీ తీసుకున్న నిర్ణయం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శివసేన  నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అమృత  ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ను  ఉద్దేశించి పలు ఘాటు విమర్శలు చేశారు. 

 

 

 

 ఒక చెడ్డ నాయకుడిని కలిగి ఉండడం మహారాష్ట్ర తప్పుకాదని కానీ ఆ నాయకుడికి మద్దతు ఇవ్వడం మాత్రం తప్పు అంటూ అమృత ఫడ్నవీస్  ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జాగో  మహారాష్ట్ర అంటూ పిలుపునిచ్చారు ఆమె. అంతేకాకుండా తాను ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ను  కూడా పోస్ట్ చేశారు. నేను దేవేంద్ర ఫడ్నవిస్ ను  పెళ్లి చేసుకోక ముందు నుంచి పూణే మున్సిపల్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు యాక్సిస్ బ్యాంకు లో కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎన్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అవి అలాగే ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకులు కూడా భారతదేశానికి చెందినవే.. ప్రైవేట్ బ్యాంకులు ఉన్నతమైన సాంకేతిక తో కూడిన సేవలను అందిస్తున్నాయి. ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇలా చేయడం ద్వారా వారు నా భర్తను నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ అమృత ఆరోపించింది.

 

 

 

దేవేంద్ర  ఫడ్నవీస్ ఎప్పుడు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని పని చేయలేదు. శివసేన పార్టీ చేస్తున్నది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉంది అంటూ అమృత ఫడ్నవీస్  ఆరోపించారు. మేము దీనిపై మౌనంగా ఉండదలుచుకోలేదు అంటూ తేల్చి చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా ప్రజల స్వేచ్ఛకు హాని కలిగించేలా ఉంది అని భావిస్తే వాటి పై పోరాటం చేస్తామంటూ ఆమె హెచ్చరించారు. అయితే గతంలో కూడా పేరు చివర ఠాక్రే అని పెట్టుకున్నంత మాత్రాన ఠాక్రే లు అయిపోరు అంటూ ఉద్దవ్ ను  ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసింది అమృత . దీంతో శివసేన మున్సిపల్ ఉద్యోగుల జీతాలను యాక్సిస్ బ్యాంకు నుంచి వేరే జాతీయ బ్యాంకులకు మార్చుతూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: