మాజీ సీఎం చంద్రబాబు అంటే రోజా ఏ రేంజ్ లో ఫైర్ అవుతారో తెలిసిందే.. ఓవైపు రాజధాని మార్పుపై అమరావతి రైతుల పోరుకు చంద్రబాబు సంఘీభావం తెలుపుతుంటే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం ఆయన తీరును ఎండగడుతున్నారు. చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి, తన గాజులు తాకట్టు పెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారంటూ విమర్శలు గుప్పించింది రోజా.

 

ఇటీవల అమరావతి రైతుల దీక్షకు హాజరైన నారా భువనేశ్వరి తన బంగారు గాజులు రైతుల పోరాటానికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు.

 

అయితే ఇలా చంద్రబాబు విరుచుకుపడటం రోజాకు కొత్తేమీ కాదు.. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆమె చంద్రబాబు వైఖరిని నిండు అసెంబ్లీలో ఎండగట్టారు. మొదటిసారిగా తాను ఎమ్మెల్యే అయిన తనకు చంద్రబాబు హయాంలో కనీసం ప్రజా సమస్యలుపై మాట్లాడేందుకు మైక్‌ కూడా నాకు అవకాశం కూడా ఇవ్వలేదని, తాము నిరసన తెలుపుతుంటే ఆ వీడియోలు బయటకు చూపించ లేదు అని బాబుపై మండిపడ్డారు.

 

గతంలో అసెంబ్లీ వీడియోలు బయటపెడితే తమ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో బాగా అర్థం అవుతుంది అని రోజా అప్పట్లో మండిపడ్డారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తనను అసెంబ్లీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారని, మహిళా ఎమ్మెల్యేపై కక్ష సాధింపు చర్యలు ఏమిటని సుప్రీంకోర్టు చెప్పినా బుద్ధి తెచ్చుకోలేదని మండి పడ్డారు.

 

చివరకు సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొని వచ్చిన కూడా అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టనివ్వలేదు మార్షల్స్‌ అడుకున్నారని, అప్పటి తనకు అండగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ ఎదుట నిరసన చేసిన కూడా.. స్పీకర్‌ కాదు కదా కనీసం సెక్రటరీ కూడా రాకుండా బాగా అవమానించారని, తమ పట్ల ఘోరంగా ప్రవర్తించడం జరిగింది అని రోజా మండి పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: