తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ జూపల్లి కృష్ణారావుకు ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ పార్టీకి రెబల్ అభ్యర్థులు మద్దతు ఇస్తారని చెప్పినప్పటికీ సీఎం కేసీఆర్ అంగికరించలేదని సమాచారం. జూపల్లి వర్గీయులు కొల్లాపూర్ లో టీఆర్ఎస్‌ పార్టీలో చేరటానికి అవకాశమే లేదని టీఆర్ఎస్‌ అధిష్టానం ఇప్పటికే తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కొల్లాపూర్ లో 20 స్థానాలు ఉండగా టీఆర్ఎస్‌ పార్టీ కేవలం 9 స్థానాలలో విజయం సాధించింది. 
 
మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవాలంటే కనీసం 12 స్థానాలు కావాల్సి ఉంది. జూపల్లి వర్గీయులు 11 స్థానాలలో విజయం సాధించారు. కానీ రెబల్స్ మద్దతు తీసుకోవటానికి టీఆర్ఎస్‌ పార్టీ అధిష్టానం కానీ సీఎం కేసీఆర్ కానీ అంగీకరించడం లేదని సమాచారం. ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా టీఆర్ఎస్‌ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గెలిచిన 9 మంది అభ్యర్థులను కూడా టీఆర్ఎస్‌ పార్టీ నేతలు క్యాంప్ కు తరలించినట్టు సమాచారం. 
 
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడంతో ఐజ, కొల్లాపూర్ మున్సిపాలిటీలలో తన మద్దతుదారులను బరిలోకి దింపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీతో పాటు ఐజ మున్సిపాలిటీలో కూడా జూపల్లి కృష్ణారావు అనుచరుల హవా కొనసాగింది. మరోవైపు మంత్రి కేటీఆర్ జూపల్లి కృష్ణారావుకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
కేటీఆర్ ను కలవడానికి వెళ్లిన జూపల్లి కృష్ణారావుకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేయటంతో టీఆర్ఎస్‌ అధిష్టానం జూపల్లి కృష్ణారావుపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కొల్లాపూర్ లో 20 మంది అభ్యర్థులపై జూపల్లి తన వర్గీయులను రెబల్స్ గా పెట్టడంతో టీఆర్ఎస్‌ అధిష్టానం జూపల్లికి షాక్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం జూపల్లి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: